Shriya Saran: వామ్మో.. రాధా భలే హూషారు.. తల్లితో పోటి పడి మరీ యోగా చేస్తోన్న శ్రియా కూతురు..
తెలుగుతోపాటు తమిళంలోనూ అనేక సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ స్లో అయ్యింది. ఇప్పటికీ వెండితెరపై రాణిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. ఎప్పుడూ తన కూతురు రాధ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే తన జిమ్ వర్కవుట్స్, డైట్ ప్లాన్, ఫిట్ నెస్ గురించి ఎప్పటికప్పుడు లేటేస్ట్ వీడియోస్ ఫాలోవర్లతో పంచుకుంటుంది.
చిత్రం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది శ్రియా శరణ్. ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోస్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు తమిళంలోనూ అనేక సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ స్లో అయ్యింది. ఇప్పటికీ వెండితెరపై రాణిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. ఎప్పుడూ తన కూతురు రాధ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది శ్రియా. అలాగే తన జిమ్ వర్కవుట్స్, డైట్ ప్లాన్, ఫిట్ నెస్ గురించి ఎప్పటికప్పుడు లేటేస్ట్ వీడియోస్ ఫాలోవర్లతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన 2 ఏళ్ల కూతురు రాధతో కలిసి యోగా చేస్తోన్న ఫోటో షేర్ చేసింది.
శ్రియా షేర్ చేసిన ఫోటోలో యోగాలో తన తల్లి చేస్తున్న సర్వంగా ఆసనాన్ని రాధ చేసింది. శ్రియాతో సమానంగా యోగా సెషన్లో రాధా పాల్గొనడం చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తన కూతురుతో కలిసి సరదాగా గడుపుతున్న వీడియోస్, ఫోటోస్ పంచుకుంది శ్రియా.
View this post on Instagram
ఇటీవల తన కూతురు రాధతో కలిసి అటవీ ప్రాంతంలో చెట్ల మధ్య సరదాగా ఆడుకుంటున్న విజువల్స్ ఇన్ స్టాలో షేర్ చేసింది. అలాగే ఇటీవల తన కూతురితో కలిసి ఫోటో షూట్ చేసింది.
ఇదిలా ఉంటే.. రష్యన్ బిజినెస్ మెన్ ఆండ్రీవ్ కొచీవ్ ను 2018లో వివాహం చేసుకుంది శ్రియా. వీరిద్దరికి 2021 జనవరిలో వీరికి పాప జన్మించింది. తమ కూతురికి రాధా శరణ్ కొఛీవ్ అని పేరు పెట్టారు. శ్రియా చివరిసారిగా కబ్జ చిత్రంలో నటించింది. అంతకు ముందు ఆర్ఆర్ఆర్ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించింది శ్రియా. తెలుగుతోపాటు.. హిందీలో పలు సినిమాలు చేస్తుంది శ్రియా.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.