AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ ఇంటికి 100 ఏళ్ల చరిత్ర ఉందా..? మన్నత్ ధర తెలిస్తే గుండె గుభేల్..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోకు ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ హీరో లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలోనే అత్యధిక ఆస్తులు కలిగిన హీరో అతడే కావడం విశేషం. షారుఖ్ ఇళ్లు మన్నత్ 1914లో నిర్మించారు. ఈ ఇంటిని బాద్ షా 2001లో కొనుగోలు చేశారు.

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ ఇంటికి 100 ఏళ్ల చరిత్ర ఉందా..? మన్నత్ ధర తెలిస్తే గుండె గుభేల్..
Shah Rukh Khan
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2025 | 7:36 PM

Share

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని అనేక ఆస్తులు చాలా ఖరీదైనవి. వాటిలో అత్యంత ముఖ్యమైన ఆకర్షణ అతడి ఇళ్లు మన్నత్. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ భవనంలో సరిగ్గా 6 అంతస్తులు ఉన్నాయి. ఈ నివాసానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గౌరీ ఖాన్ ఇప్పుడు ఈ ఇంటిని పునరుద్ధరిస్తుంది. ఈ నివాసానికి షారుఖ్ ఖాన్ ఎంత చెల్లించాడు? ఇప్పుడు ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం. మన్నత్ నివాసం ముంబైలోని బాంద్రా సమీపంలో ఉంది. ఈ నివాసం పరిమాణం దాదాపు 27,000 చదరపు అడుగులు. కార్ పార్కింగ్ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఒకేసారి అనేక కార్లను పార్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ నివాసం పాతకాలపు, ఆధునిక కళాఖండాల కలయిక.

మన్నత్ 1914లో నిర్మించబడిందని చెబుతారు. పారిస్‌లోని ఒక కుటుంబానికి చెందిన ఈ ఇంటిని 1990లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుగోలు చేసింది. ఆ కంపెనీ ముందుగా సల్మాన్ ఖాన్‌ను కొనుగోలు చేయాలని కోరింది. కానీ అందుకు అతడు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆ ఆఫర్ షారుఖ్ ఖాన్ కు వెళ్ళింది. షారుఖ్ దీనిని 2001 లో కొన్నాడు. ఈ ఇంటి లోపలి భాగాన్ని గౌరీ ఖాన్ స్వయంగా డిజైన్ చేశారు. ఈ ఇంటిని షారుఖ్ ఖాన్ 13 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ బంగ్లా ధర ఇప్పుడు 200 కోట్ల రూపాయలకు పైగా ఉంది. విశేషమేమిటంటే ఇప్పుడు చేపట్టబోయే పునరుద్ధరణ పనులకు ఒకటి కాదు, రెండు కాదు, సరిగ్గా 25 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఆలోచన అభిమానులను ఆశ్చర్యపరిచింది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..