Sonu Sood: సోనూసూద్ పై అభిమానంతో టీవీ పగలగొట్టిన బుడ్డోడు.. కారణం తెలిసి షాకైన తల్లిదండ్రులు..

సోనూసూద్.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారెవరూ ఉండరేమో.. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో.. సాయం చేయాలేమని ప్రభుత్వాలు చేతులెత్తేసిన క్రమంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు.

Sonu Sood: సోనూసూద్ పై అభిమానంతో టీవీ పగలగొట్టిన బుడ్డోడు.. కారణం తెలిసి షాకైన తల్లిదండ్రులు..
Sonu Sood
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 14, 2021 | 11:53 AM

సోనూసూద్.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారెవరూ ఉండరేమో.. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో.. సాయం చేయాలేమని ప్రభుత్వాలు చేతులెత్తేసిన క్రమంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు. తమ సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపడమే కాకుండా.. ఆర్థిక సాయాన్ని అందించి వారిపట్ల దేవుడిగా మారాడు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు సోనూసూద్. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా సోనూ తన సేవా కార్యక్రమాలను విరమించుకోలేదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడిగా.. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిస్తూనే ఉన్నాడు సోనూసూద్. ఇటీవల కరోనా రెండో దశ దేశాన్ని ఉక్కిరిబిక్కికి చేస్తున్న తరుణంలోనూ సోనూ సూద్ తన సహాయ కార్యక్రమాలను మరింత పెంచాడు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతల వరకు అందరూ సోనూసూద్ సాయం చేయాలని వేడుకున్నారు. దీంతో సోనూసూద్‏కు అనేకమంది అభిమానులయ్యారు. ఆయన ద్వారా సాయం పొందిన ఎంతో మంది సోనూసూద్‏ని తమ దైవంగా భావిస్తూ.. ఆరాధిస్తున్నారు. ఇక మరికొందరు తమ పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుండగా.. మరికొందరు తమ వ్యాపారాలకు సోనూ పేరు పెట్టుకున్నారు. అయితే తాజాగా సోనూసూద్ అంటే అమితమైన ఇష్టమున్న ఓ బుడ్డోడు మాత్రం అందరూ షాకయ్యే పని చేశాడు.

సోనూసూద్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఓ ఏడేళ్ల పిల్లాడు తమ ఇంట్లోని టీవీ పగలగోట్టాడు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‏లో సోమవారం జరిగింది. పూర్తి వివరాల్లోకెలితే. న్యాల్కల్ ఎస్సీ కాలనీకి చెందిన విరాట్ అనే బాలుడు ఇంట్లో టీవీ చూస్తున్నాడు. అయితే అందులో విలన్‏గా నటించిన సోనూసూద్‏ను హీరో కొట్టే సీన్ చూడగానే.. ఆ పిల్లాడికి విపరీతమైన కోపం వచ్చింది. కరోనా సమయంలో అందరినీ ఆదుకున్న సోనూసూద్ అంకుల్‏ను కొడతావా అంటూ బయటి నుంచి రాయి తెచ్చి టీవీని పగలగోట్టాడు. ఆకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో విరాట్ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే తెరుకుని టీవీ ఎందుకు బద్దలు కోట్టావని ప్రశ్నించగా.. సోనూసూద్ అంకుల్‏ను కొడితే ఊరుకోనంటూ గట్టిగా వాదించాడు..

Also Read: Nivetha Pethuraj: కార్ రేసర్‏గా మారిన హీరోయిన్.. రేసింగ్ సంస్థ నుంచి సర్టిఫికెట్ అందుకున్న నివేతా పేతురాజ్..

Suresh Babu: కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతకే మూవీపై సర్వ హక్కులు.. ఎక్కడ రిలీజ్ చేయాలనేది తన ఇష్టం.. ‘నారప్ప’ ఓటీటీపై సురేష్ బాబు క్లారిటీ..

Akashame Ni Haddura Movie: బాలీవుడ్‏లో రీమేక్ కానున్న సూర్య “ఆకాశమే నీ హద్దురా” మూవీ.. అఫీషియల్‏గా ప్రకటించిన హీరో..