Nivetha Pethuraj: కార్ రేసర్‏గా మారిన హీరోయిన్.. రేసింగ్ సంస్థ నుంచి సర్టిఫికెట్ అందుకున్న నివేతా పేతురాజ్..

"మెంటల్ మదిలో" సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది నివేతా పేతురాజ్. ఈ మూవీ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా వంటి సినిమాలల్లో నటించి మెప్పించింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్

Nivetha Pethuraj: కార్ రేసర్‏గా మారిన హీరోయిన్.. రేసింగ్ సంస్థ నుంచి సర్టిఫికెట్ అందుకున్న నివేతా పేతురాజ్..
Nivetha Pethuraj
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 13, 2021 | 8:32 PM

“మెంటల్ మదిలో” సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది నివేతా పేతురాజ్. ఈ మూవీ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా వంటి సినిమాలల్లో నటించి మెప్పించింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన అల వైకంఠపురములో సినిమతో నివేతా పేతురాజ్ గుర్తింపు పొందింది. ఈ సినిమాలో నివేతా నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత నివేతాకు టాలీవుడ్‏లో వరసు అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవల ఎనర్జిటిక్ రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమాలో కీలకపాత్రలో నటించింది నివేతా. ప్రస్తుతం ఈ అమ్మడు రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విరాట పర్వం మూవీలో కీలక పాత్ర చేస్తుంది. అలాగే తెలుగులో మూడు, నాలుగు సినిమాల్లోనూ నివేతా కనిపించబోతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కార్ రేసర్ అవతారమెత్తింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నివేతాకు కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టమట. అందుకోసం తను కార్ రేసింగ్ నెర్చుకుంటందట. తాజాగా ఈ అమ్మడు.. ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో లెవెల్ 1లో సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. మొమెంటమ్ – స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ సంస్థ నుండి నివేతా పేతురాజ్ ఈ సర్టిఫికెట్ ను పొందింది. దానికి సంబంధించిన ఫోటోలతో పాటు కార్ రేసింగ్ లో పాల్గొన్న వీడియోనూ నివేత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే… ఇటు తెలుగులోనే కాకుండా.. నివేతా.. తమిళంలోనూ ఫుల్ బిజీగా మారిపోయింది. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ “పార్టీ” లోనూ ఎ, ఎల్.విజయ్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ “అక్టోబర్ 31 లేడీస్ నైట్” లోనూ నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తోంది. ఇక తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్న పాగల్ చిత్రంలోనూ నివేతా నటిస్తోంది.

ట్వీట్..

Also Read: Suresh Babu: కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతకే మూవీపై సర్వ హక్కులు.. ఎక్కడ రిలీజ్ చేయాలనేది తన ఇష్టం.. ‘నారప్ప’ ఓటీటీపై సురేష్ బాబు క్లారిటీ..

Pooja Bhatt: తాగుడుకు బానిసయ్యాను.. అందుకు పోరాటమే చేశా.. హీరోయిన్ పూజాభట్ సంచలన కామెంట్స్..