Pavala Shyamala: నాకు జరిగిన అవమానం గురించి తెలిస్తే చిరంజీవి అస్సలు సహించరు.. పావలా శ్యామల కామెంట్స్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పావలా శ్యామలా.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తన తోటి నటీనటులను గౌరవంగా చూసుకుంటారని..

Pavala Shyamala: నాకు జరిగిన అవమానం గురించి తెలిస్తే చిరంజీవి అస్సలు సహించరు.. పావలా శ్యామల కామెంట్స్..
Pavala Shyamala, Megastar C
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 14, 2022 | 4:20 PM

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి పావలా శ్యామల సుపరిచితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గోలీమార్, మనసంతా నువ్వే, ఖడ్గం, ఆంధ్రావాల వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. మత్తు వదలరా సినిమా తర్వాత ఆమె మరో మూవీలో కనిపించలేదు. ఓ వైపు గుండె సంబంధిత సమస్యలు.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె.. తన కుమార్తెతో కలిసి హైదరాబాద్‏లోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పావలా శ్యామలా.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తన తోటి నటీనటులను గౌరవంగా చూసుకుంటారని.. అందర్నీ అభిమానిస్తుంటారని అన్నారు. చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని.. అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పని పట్ల ఆయన అంకితభావం చూపిస్తుంటారని అన్నారు.

పావలా శ్యామలా మాట్లాడుతూ ” మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పని ప్టల అంకితభావం చూపిస్తుంటారు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం అందించారు. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని తెలుసుకుని రూ. 2 లక్షలు పంపించి ఆదుకున్నారు. నటీనటులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఆయన ముందుండి మాట్లాడతారు. నాకు జరిగిన అవమానం గురించి ఆయనకు తెలిస్తే సహించరు ” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆమెకు జరిగిన అవమానం ఏమిటనేది వెల్లడించలేదు.

ఇండస్ట్రీలోని పలువురు అగ్రహీరోలు తనకు సాయం చేసినట్లు వార్తలు వచ్చాయని.. అలాగే తాను చెప్పని మాటలు కూడా అన్నట్లు పూకార్లు వినిపించాయని..వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో తనకు పవన్ కళ్యాణ్ రూ. లక్ష ఇచ్చి సాయం చేశారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.