Rajashekar : నేను అలసిపోయాను.. పని లేకుండా ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్టే.. సీనియర్ హీరో రాజశేఖర్..
ఒకప్పుడు హీరోగా వెండితెరపై ఎన్నో విజయాలను సాధించిన హీరోయిలలో రాజశేఖర్ ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటున్న రాజశేఖర్..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. శర్వానంద్ హీరోగా వస్తున్న బైకర్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఈవెంట్లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇప్పుడు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సినిమా తర్వాత ఆయన నటిస్తోన్న లేటేస్ట్ మూవీ బైకర్. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో పాల్గొన్న సీనియర్ హీరో రాజశేఖర్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పనిలేకపోతే జైల్లో ఉన్నట్టే ఉందని అన్నారు. బైకర్ సినిమా తనకు చాలా సంతృప్తిని ఇచ్చిన మూవీ అన్నారు. ఈ గ్లింప్స్ ముందే చూపించి ఉంటే హీరో రోల్ చేస్తానని అడిగేవాడినని అన్నారు.
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
రాజశేఖర్ మాట్లాడుతూ.. “గతంలో ఓ సినిమా సాంగ్ షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లాం. మా ఫోటోగ్రాఫర్ రాకపోవడంతో అక్కడ ఫోటోగ్రాఫర్ ను తీసుకున్నాం. ఆయన ఫోటోస్ తీస్తూ.. ఎన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు .. ? ఎన్ని సినిమాలు చేశారు.. ? ఆ తర్వాత ఏం చేయబోతున్నారు? అని అడిగితే రెండు మూడేళ్లు నటించబోయే సినిమాల గురించి చెప్పాను. అప్పుడు అతడు నేను చాలా లక్కీ అన్నాడు. ఎందుకని అడిగితే మీ చేతినిండా పని ఉందని చెప్పాడు. అప్పుడు అంతగా పట్టించుకోలేదు. కానీ వర్క్ లేకుండా ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్లే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
కరోనా వచ్చిన తర్వాత తాను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కష్టపడి రెండు మూడు నెలల్లో కోలుకున్నానని.. ఆరు నెలల్లో పూర్తిగా రెడీ అయిపోయానని అన్నారు. దాదాపు వంద సినిమాలు చేసి ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడిన తర్వాత నేను అలసిపోయాను.. ఇకపై హీరోగానే కాకుండా మంచి క్యారెక్టర్స్ చేయాలని ఫిక్స్ అయ్యాను.. ఇదివరకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నచ్చక చేయలేదు. అభిలాష్ నా దగ్గరకు వచ్చి బైకర్ స్టోరీ చెప్పాడు. నచ్చడంతో ఒకే చెప్పాను అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..




