AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rama Prabha: రమా ప్రభ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న సీనియర్ నటి

సీనియర్ నటీమణి రమాప్రభ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లేడీ కమెడియన్ గా వేలాది సినిమాల్లో నటించి మెప్పించారామె. సుమారు ఆరుదశాబ్దల సినీ కెరీర్‌లో 1400కు పైగా సినిమాల్లో నటించిన ఘనత రమా ప్రభ సొంతం. అయితే ఇప్పుడు వయసు మీద పడడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు రమా ప్రభ.

Rama Prabha: రమా ప్రభ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న సీనియర్ నటి
Actress Ramaprabha
Basha Shek
|

Updated on: Oct 18, 2024 | 2:57 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు, వారి కుటుంబ సభ్యులు ఆకస్మికంగా కన్నుమూస్తున్నారు. దీంతో సినీ అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. ఇటీవలే ప్రముఖ హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి ఆయన ఇప్పట్లో కోలుకోలేకపోవచ్చు. ఇది మర్చిపోయేలోపే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్‌ నటి రమాప్రభ సోదరి తనయుడు, టాలీవుడ్ నిర్మాత సురేష్‌ ఆకస్మికంగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం (అక్టోబర్ 18) తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సురేష్ కన్నుమూశారు. దీంతో రమాప్రభ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సురేష్ ఆకస్మిక మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రమా ప్రభ కుటుంబానికి ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

కాగా రమా ప్రభ సమర్పణలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా రూపొందిన ‘అప్పుల అప్పారావు’ వంటి సినిమాకు సురేష్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక మదనపల్లిలో రాజకీయంగా కూడా ఆయనకు బాగా పలుకుబడి ఉంది. కాగా సురేష్ గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన రమా ప్రభతో కలిసి రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సమయంలోనే సురేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరులోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. గత కొన్ని రోజులుగా వైద్యం అందించినప్పటికీ సురేష్ కోలుకోలేకపోయారు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. సురేష్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.