AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivaji Raja : హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శివాజీరాజా తనయుడు.. దర్శకుడు ఎవరంటే.!

హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పించిన శివాజీరాజా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు 400 వందల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నరు శివాజీ రాజా.

Sivaji Raja : హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శివాజీరాజా తనయుడు.. దర్శకుడు ఎవరంటే.!
Shivaji Raja New
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 05, 2021 | 7:53 PM

Share

Sivaji Raja : హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పించిన శివాజీరాజా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన  దాదాపు 400 వందల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నరు. ఇటు వెండి తెరపై అటు బుల్లి తెరపై తన నటనతో మెప్పించారు. అయితే ఆమధ్య ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శివాజీ రాజా బయట పెద్దగా కనిపించలేదు.

తాజాగా ఆయన కుమారుడు విజయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ రాజా హీరోగా ‘వేయు శుభములు కలుగు నీకు’ అనే సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో శివాజీ రాజా కనిపించారు. అయితే ఆయన మునుపెన్నడూ లేనివిధంగా కనిపించి షాక్ ఇచ్చారు.

గుండెపోటు వచ్చిన తర్వాత ఆయన చాలా బరువు తగ్గినట్టు కనిపిస్తున్నారు. వందల సినిమాల్లో నటించిన శివాజీ రాజా కొంతకాలం మా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆరోగ్య రిత్యా నటనకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం శివాజీరాజా ఆరోగ్యం పై పూర్తి దృష్టి పెట్టారు. త్వరలోనే తిరిగి సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Charan : త్వరలో శంకర్ సినిమా అప్డేట్.. హింట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్.. ఖుషీలో అభిమానులు

Allu Arha: కుందనపు బొమ్మలా అల్లు అర్హ.. నెట్టింట వైరల్ అవుతున్న బన్నీ గారాల పట్టి క్యూట్ వీడియో..

Jabardasth Vinod: సోషల్ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేసిన వినోద్.. సాలిడ్ సమాధానం చెప్పాడుగా…