AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : త్వరలో శంకర్ సినిమా అప్డేట్.. హింట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్.. ఖుషీలో అభిమానులు

జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నచెర్రీ కెరీర్‌కు.. ఈ సినిమా బ్రేక్‌ ఇవ్వబోతోందా.? బ్రేక్‌ సంగతి అటుంచితే అసలు ఈ సినిమా మొదలవుతుందా.. ?

Ram Charan : త్వరలో శంకర్ సినిమా అప్డేట్.. హింట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్.. ఖుషీలో అభిమానులు
Charan
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2021 | 5:00 PM

Share

Ram Charan : జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నచెర్రీ కెరీర్‌కు.. ఈ సినిమా బ్రేక్‌ ఇవ్వబోతోందా.? బ్రేక్‌ సంగతి అటుంచితే అసలు ఈ సినిమా మొదలవుతుందా.. ? ఇది సగటు చెర్రీ అభిమాని డైరెక్టర్‌ శంకర్‌ ను అడుగుతున్న… అడగాలనుకుంటున్న ప్రశ్న. “శంకర్‌ డైరెక్షన్లో చెర్రీ సినిమా” అని దిల్ రాజు ఎప్పుడు అనౌన్స్‌ చేశారో.. అప్పటి నుంచి అభిమానుల్లో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది.. ఆ తరువాత లైకా కేసుతో ఈ సినిమా పాజిబులిటీ పై ఓ డౌట్ కూడా క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ తాజాగా ఇండస్ట్రీలోనూ… సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి స్టార్ట్ కాబోతుంది.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తవ్వగా.. రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ మూవీ తర్వాత చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేబోతున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో.. చరణ్ రాజకీయ నాయకుడిగా  కనిపించబోతున్నట్లుగా టాక్. అయితే గత కొద్ది రోజులుగా.. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ లైకా , శంకర్ కు మధ్య ఇండియన్ 2 వివాదం నడుస్తోంది. తమ సినిమా పూర్తి చేసేవరకు శంకర్ ఇతర మూవీ చేయకూడదని లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు శంకర్ కు ఊరటనిచ్చాయి. దీంతో తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు శంకర్.

ఈ క్రమంలోనే రామ్ చరణ్, దిల్ రాజులతో శంకర్ ఇటీవల సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ ట్విట్టర్ లో షేర్ చేసారు. అలాగే శంకర్ ఫ్యామిలీ ని కలవడం చాలా సంతోషం గా ఉందని, ఆయన తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు చరణ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని హింట్ ఇచ్చారు చరణ్. అలాగే  ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల ఆగస్టు లో స్టార్ చేయాలని ఆ మీట్‌లో డిసైడ్ చేశారట ఈ క్రేజీ స్టార్స్‌. అందుకోసం ప్లాన్‌ ఆఫ్ యాక్షన్ ను కూడా రెడీ చేసేశారని తెలుస్తుంది. ఇక ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‏గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందే వినయ విధేయ రామ సినిమలో వీరిద్దరూ కలిసి నటించారు. మరో సారి ఈ జోడి మనల్ని కనివిందు చేయనుందని తెలుస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ ని ఖరారు చేసినట్టు సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arha: కుందనపు బొమ్మలా అల్లు అర్హ.. నెట్టింట వైరల్ అవుతున్న బన్నీ గారాల పట్టి క్యూట్ వీడియో..

Kalyan Ram Birthday : నందమూరి హీరో నయా మూవీ.. బింబిసారా టూ డెవిల్..

Hero Vishal :హైదరాబాద్ లో వర్చువల్ ఆర్ట్ షో ‘ట్రాన్స్’ ను ప్రారంభించిన హీరో విశాల్..