Hero Vishal :హైదరాబాద్ లో వర్చువల్ ఆర్ట్ షో ‘ట్రాన్స్’ ను ప్రారంభించిన హీరో విశాల్..
ప్రఖ్యాత సౌత్ ఇండియా నటుడు మరియు నిర్మాత విశాల్ ఆదివారం వర్చువల్ ఆర్ట్ షో - ట్రాన్స్ - ను ప్రారంభించారు. ఇది నటి మరియు ఆర్టిస్ట్ మాయ నెల్లూరి యొక్క కళాకృతుల సమాహారం.
Hero Vishal : ప్రఖ్యాత సౌత్ ఇండియా నటుడు నిర్మాత విశాల్ ఆదివారం హైదరాబాద్ లో వర్చువల్ ఆర్ట్ షో ట్రాన్స్ ను ప్రారంభించారు. ఇది నటి అలాగే ఆర్టిస్ట్ మాయ నెల్లూరి యొక్క కళాకృతుల సమాహారం. సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అయ్యే భారతదేశపు మొట్టమొదటి AI- ఆధారిత వీడియో ప్లాట్ఫామ్ స్టార్గేజ్ లో ట్రాన్స్ ప్రారంభించబడింది. ఈ ఆర్ట్ షో గురించి విశాల్ మాట్లాడుతూ.. “వర్చువల్ షోలు ఆర్ట్ షోల భవిష్యత్తు. ట్రాన్స్ అనేది ఒక వినూత్న ప్రదర్శన, అంతే కాదు ఇది మరింత విస్తృతంగా కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ప్రదర్శనను చూస్తారు. విభిన్న కళాకారుల చిత్రాలను చూడటం వలన ప్రదర్శనలు చాలా బాగుంటాయి..ఇప్పుడు ఆ ప్రదర్శనలు ఎక్కువ మందికి చేరడానికి ఇది గొప్ప మార్గం”. అని అన్నారు.
అనంతరం తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఆర్టిస్ట్ మాయ నెల్లూరి మాట్లాడుతూ, “విశాల్ వంటి స్టార్ హీరో, సృజనాత్మక మేధావి ఈ ప్రదర్శనను ప్రారంభించినందుకు చాలా సంతోషిస్తున్నాను అని అన్నారు. నేను నా హృదయంలోనుంచి వచ్చిన ఈ చిత్రాలను ప్రతి ఒక్కరూ చూడాలని ఆశిస్తున్నాను అని ఆమె తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :