AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashritha: వెంకటేష్ కూతురు ఆశ్రిత ఒక్క పోస్ట్ పెడితే ఎంత అందుకుంటుందో తెలుసా ?..

విక్టరీ వెంకటేష్ కూతుర్లకు సంబంధించిన విషయాలు పెద్దగా బయటకు రావు. ఇప్పటి వరకు వారికి సంబంధించిన ప్రతి విషయం ఎక్కువగా వినిపించదు. అయితే తాజాగా వెంకటేష్ గారాలపట్టి అశ్రిత

Ashritha: వెంకటేష్ కూతురు ఆశ్రిత ఒక్క పోస్ట్ పెడితే ఎంత అందుకుంటుందో తెలుసా ?..
Venkatesh
Rajitha Chanti
|

Updated on: Jul 05, 2021 | 1:21 PM

Share

విక్టరీ వెంకటేష్ కూతుర్లకు సంబంధించిన విషయాలు పెద్దగా బయటకు రావు. ఇప్పటి వరకు వారికి సంబంధించిన ప్రతి విషయం ఎక్కువగా వినిపించదు. అయితే తాజాగా వెంకటేష్ గారాలపట్టి అశ్రిత అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఆమె ఇన్‏స్టాగ్రామ్ రిచ్‏లిస్ట్ జాబితాలో చేటు సంపాదించుకుంది. అయితే అశ్రితకు కుకింగ్ అలవాటు ఉందన్న సంగతి తెలిసిందే. ఎన్నో రకరకాల వంటకాలను అశ్రిత తయారు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఇన్‏స్టాగ్రామ్ లో ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అందులో తను చేసే రకారకాల వంటకాల వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఇన్‏స్టాగ్రామ్ లో 13 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Aarshitha

Aarshitha

ఇదిలా ఉంటే.. ఇటీవల హోపర్ డాట్ కం ఇన్‏స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ జాబితా విడుదల చేసింది. అందులో వెంకటేశ్ కూతురు ఆశ్రిత కూడా చోటు సంపాదించుకుంది. ఇందులో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో హాలీవుడ్ నటుడు క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఇండియా నుంచి విరాట్ కోహ్లి, ప్రియాంక చోప్రా ఉన్నారు. ఇక ఇదే జాబితాలో అశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377 స్థానంలో నిలవగా… ఆసియా మొత్తంలో 27వ ర్యాంకులో ఉంది. భారతీయులు అత్యల్పంగా ఉన్న ఈ జాబితాలో అశ్రిత చోటు దక్కించుకోవడం విశేషం. ఆమె ఇన్‏స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్.. వీడియోకు సుమారు 400 డాలర్లు తీసుకుంటుందట. 2019లో అశ్రిత వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు స్పెయిన్‏లోని బార్సిలోనాలో ఉంటున్నారు.

Also Read: Rashmika Mandanna: రష్మికకు జంతువులంటే అమితమైన ప్రేమ.. పావురం దగ్గర్నుంచి కుక్క పిల్లల వరకు అన్నింటినీ..

Radha: రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేసిన హీరోయిన్.. చిత్రహింసలు పెడుతూ.. చంపుతానని బెదిరిస్తున్నాడని..

Vijay Devarakonda : కొత్త లుక్‌తో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ..! భారీ కండలు, పొడవాటి జుట్టుతో వైరల్ అవుతున్న ఫొటో..

Ram Charan: చరణ్ సినిమాకు శంకర్ లైన్ క్లియర్ అయ్యిందా ? చెర్రీ న్యూ మూవీ షూటింగ్ అప్‏డేట్…