AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Chandra Mohan: ఆ వార్తలన్ని అవాస్తవం.. అలాంటి వారిని శిక్షించాలి..

Actor Chandra Mohan:  చంద్రమోహన్.. పెద్ద స్టార్ హీరోలతో సరిసమానంగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అటు హీరోగా కొనసాగుతున్న సమయంలోనే..

Actor Chandra Mohan:  ఆ వార్తలన్ని అవాస్తవం.. అలాంటి వారిని శిక్షించాలి..
Chandramohan
Rajitha Chanti
|

Updated on: May 25, 2021 | 2:38 PM

Share

Actor Chandra Mohan:  చంద్రమోహన్.. పెద్ద స్టార్ హీరోలతో సరిసమానంగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అటు హీరోగా కొనసాగుతున్న సమయంలోనే.. హాస్య నటుడిగా.. తండ్రిగా, స్నేహితుడిగా ఇలా ఎన్నో పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం నుంచి ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న నటులలో చంద్రమోహన్ ఒకరు. దాదాపు 55 సంవత్సరాల పాటు నటిస్తూనే ఉన్నారు. మే 23న చంద్రమోహన్ 81వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా.. వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమాలకు సంబంధించిన విషయాల గురించి చెప్పుకోచ్చారు.

హీరోగా నటిస్తే.. కేవలం 50 సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీలో ఉండేవాడినని.. కానీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే.. ఆల్ రౌండర్ అనిపించుకోవాలని అందుకే.. అన్ని పాత్రలు చేయడం ప్రారంభించానని చెప్పుకోచ్చారు. అలా నిర్విరామంగా 50 సంవత్సరాలు సినిమాలు చేస్తూ.. ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశానని చెప్పారు. రాఖీ సినిమా చేస్తున్న సమయంలో బైపాస్ సర్జరీ చేయించుకున్నానని.. అలాగే.. దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో ఆరోగ్య సమస్యలతో షూటింగ్ కూడా వాయిదా వేశానని చెప్పారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితులు.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సినిమాలు చేయనని చెప్పారు. గత కొద్ది రోజులుగా చంద్రమోహన్ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన సన్నిహితులు స్పందించారు. ప్రస్తుతం చంద్రమోహన్ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఆయనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాం. గతంలో కూడా ఆయన ఆరోగ్యంపై రూమర్లు సృష్టించారు. అలాంటి వాళ్లను దేవుడే శిక్షించాలి అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల చంద్రమోహన్ మాట్లాడుతూ… తనకు సినీ జీవితం చాలా నేర్పించిందని.. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని తెలుసుకున్నానని.. అలాగే.. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని.. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని తెలుసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా.. చెప్పుకోలేని చేదు నిజాల్ని ఎలా గుండెల్లో దాచుకోవాలో చెప్పింది అంటూ చంద్రమోహన్ తన సినీ జీవితం గురించి చెప్పారు.

Also Read: రెమ్యునరేషన్ భారీగా పెంచిన పాన్ ఇండియా డైరెక్టర్.. ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ అంత తీసుకుంటున్నాడా ?

Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మరోసారి చిక్కుకున్న జబర్దస్త్ నటుడు.. గాలింపు చేపట్టిన పోలీసులు..