Rao Ramesh: మరో సాలిడ్ పాత్రలో రావు రమేష్.. ‘కేజీఎఫ్ 2’లోని లుక్ రిలీజ్.!
2018లో విడుదలై అన్ని భాషల్లోనూ సంచలన విజయం నమోదు చేసుకున్న చిత్రం ‘కేజీఎఫ్’. దీనికి సీక్వెల్‌గా రూపొందుతోంది ‘కేజీఎఫ్ 2’....
2018లో విడుదలై అన్ని భాషల్లోనూ సంచలన విజయం నమోదు చేసుకున్న చిత్రం ‘కేజీఎఫ్’. దీనికి సీక్వెల్‌గా రూపొందుతోంది ‘కేజీఎఫ్ 2’. కన్నడ నటుడు యష్ ప్రధాన పాత్రలో.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్.. ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఇలా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను కేజీఎఫ్ టైమ్స్ అనే మ్యాగజైన్స్ ద్వారా మేకర్స్ అభిమానులతో పంచుకుంటున్నారు .
తాజాగా టాలీవుడ్ నటుడు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా తన రోల్‌పై స్పెషల్ మ్యాగజైన్ రిలీజ్ చేసింది కేజీఎఫ్ టీమ్. ఆయన విషెస్ చెబుతూ ట్విట్టర్‌లో రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో రావు రమేష్ కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర పోషిస్తున్నారు. రాకీ కేసును డీల్ చేసే సీబీఐ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా, ఇదివరకే గ్లింప్స్‌తో పాటుగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైంకి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా డ్యూరేషన్ 2గంటల 52 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తుంది.
Wishing our #KannegantiRaghavan, #RaoRamesh sir a very Happy Birthday.#KGFChapter2. pic.twitter.com/3iFBNK4EFx
— Hombale Films (@hombalefilms) May 25, 2021