రివీల్డ్ : పవన్ చేతిపై ఉన్న టాటూ సీక్రెట్ ఇదే..!
ఇప్పుడు పవర్ స్టార్ జోరు మాములుగా లేదు. ఓ వైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఊహించని విధంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణాన్ని తెచ్చారు. ప్రస్తుతం ఆయన ‘పింక్’ రీమేక్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు క్రిష్ మూవీ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హరీశ్ శంకర్‌తో కూడా సినిమా అనౌన్స్ అయ్యింది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశానికి […]
ఇప్పుడు పవర్ స్టార్ జోరు మాములుగా లేదు. ఓ వైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఊహించని విధంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణాన్ని తెచ్చారు. ప్రస్తుతం ఆయన ‘పింక్’ రీమేక్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు క్రిష్ మూవీ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హరీశ్ శంకర్‌తో కూడా సినిమా అనౌన్స్ అయ్యింది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశానికి హాజరైన పవన్..గుబురు గడ్డం తీసేసి..బాగా హెయిర్ పెంచి కనిపించారు. అంతేకాదు ఆయన చేతిపై టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీనిపై రకరకాలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఎట్టకేలకు ఆ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ రివీలయ్యింది. క్రిష్‌తో చేస్తోన్న మూవీ కోసం పవన్ టెంపరరీ గద్ద టాటూ వేయించుకున్నాడట. 18వ శతాబ్దం నాటి మొఘల్ పాలన నేపథ్యంలో ఈ మూవీ కథాశం తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాని సమాచారం . ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ మూవీని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.