విడుదలకు ముందే భారీ రికార్డు సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’
RRR Update: టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇందులో ‘చెర్రీ సీతారామ రాజుగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీం’ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులను సృష్టించింది. ఈ లక్కీ ఛాన్స్‌ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అదేంటంటే ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రైట్స్‌ని దిల్‌రాజు […]
RRR Update: టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇందులో ‘చెర్రీ సీతారామ రాజుగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీం’ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులను సృష్టించింది. ఈ లక్కీ ఛాన్స్‌ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అదేంటంటే ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రైట్స్‌ని దిల్‌రాజు భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం. నైజాం థియేట్రికల్ హక్కులను రూ.72 కోట్లకు కొనుగోలు చేయగా, ఏపీ హక్కులను రూ.100 కోట్లకు దిల్ రాజు దక్కించుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.
కాగా.. ఇప్పటికే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఇటీవలే తెలిపింది. అందులోనూ అది జనవరి సీజన్ కాబట్టి.. ఇతర సినిమాలకి గట్టి పోటీనే ఇవ్వనుంది. కాగా.. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో పాటు ఒలివియా మోరస్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అజయ్ దేవగణ్, రాహుల్ రామకృష్ణ, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.