‘వైకుంఠపురం’కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట..?
Ala Vaikuntapuram lo Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల..వైకుంఠపురములో’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాక పలు చోట్ల నాన్-బాహుబలి రికార్డ్స్ కూడా కొల్లగొట్టిందని టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సీక్వెల్ చేసే […]
Ala Vaikuntapuram lo Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల..వైకుంఠపురములో’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాక పలు చోట్ల నాన్-బాహుబలి రికార్డ్స్ కూడా కొల్లగొట్టిందని టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అరవింద్‌తో త్రివిక్రమ్ చర్చలు జరిపినట్లు సమాచారం. అరవింద్ కూడా దీనికి సుముఖంగా ఉన్నారని వినికిడి. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ సుకుమార్‌తో ఓ సినిమా.. ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. అటు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్‌తో కలిసి ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.