Breaking: జేసీకి షాక్ మీద షాక్.. ఈసారి ఆర్టీఏ..

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా జేసీకి చెందిన ట్రావెల్స్ బస్సుల సీజ్ కొనసాగుతుండగా.. ఇటీవల ఆయనకు చెందిన త్రిశూల్ సిమెంట్స్ మైనింగ్ లీజును రద్దు చేశారు. తాజాగా మరోసారి జేసీ వెంట పడిన రవాణా శాఖ అధికారులు ఆయనతోపాటు ఆయన కుటుంబీకులకు పెద్ద షాకే ఇచ్చారు. జేసీ దివాకర్ కుటుంబానికి చెందిన ట్రావెల్స్‌పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో […]

Breaking: జేసీకి షాక్ మీద షాక్.. ఈసారి ఆర్టీఏ..
Follow us

|

Updated on: Feb 08, 2020 | 2:12 PM

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా జేసీకి చెందిన ట్రావెల్స్ బస్సుల సీజ్ కొనసాగుతుండగా.. ఇటీవల ఆయనకు చెందిన త్రిశూల్ సిమెంట్స్ మైనింగ్ లీజును రద్దు చేశారు. తాజాగా మరోసారి జేసీ వెంట పడిన రవాణా శాఖ అధికారులు ఆయనతోపాటు ఆయన కుటుంబీకులకు పెద్ద షాకే ఇచ్చారు.

జేసీ దివాకర్ కుటుంబానికి చెందిన ట్రావెల్స్‌పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం 2017లో సుప్రీంకోర్టు బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ ఇచ్చిన తీర్పును జేసీ కుటుంబానికి చెందిన ట్రావెల్స్ సంస్థలు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని, అందుకే వాటి వివరాలతో జేసీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రసాద్ రావు వివరించారు.

బీఎస్-4 వాహనాలు మాత్రమే వినియోగించాల్సి వుంటుందని, కానీ ఒక్క అనంతపురం జిల్లాలోనే 68 నిషేధిత బీఎస్-3 వాహనాలు గుర్తించామని చెబుతున్నారు రవాణా శాఖాధికారులు. నాగాలాండ్ రాష్ట్రంలో బీఎస్3 వాహనాలను బీఎస్-4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించారని అంటున్నారు. ఆరు వాహనాలు చవ్వా గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని, ఒక వాహనం జేసీ ట్రావెల్స్ సంస్థ జటాధర ఇండస్ట్రీస్ పేరిట రిజిస్ట్రార్ అయ్యిందని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి పేరిట నాలుగు లారీలు రిజిస్ట్రార్ అయ్యయని చెప్పారు. సేకరించిన అన్ని వివరాలతో అనంతపురం వన్ టౌన్ పీఎస్‌లో జేసీపై ఫిర్యాదు చేశామని ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.