‘ఆర్ఆర్ఆర్’ను లైట్‌గా తీసుకుంటున్నారా..!
టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్‌ఆర్. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ రాబోతోంది. బాహుబలి లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై మిగిలిన ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నప్పటికీ., కొన్ని కారణాల వలన వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. దీంతో […]
టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్‌ఆర్. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ రాబోతోంది. బాహుబలి లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై మిగిలిన ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నప్పటికీ., కొన్ని కారణాల వలన వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. దీంతో జూలై, ఆగష్టులో తమ సినిమాలు విడుదల చేయాలనుకున్న దర్శకనిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్‌ను పెద్దగా పట్టించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి పోటీగా వచ్చే ఏడాది సంక్రాంతికి నాలుగు, ఐదు సినిమాలు రాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్, అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరు టాప్ హీరోలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్‌లు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డును ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. బాహుబలి 2 వచ్చి మూడేళ్లు అవుతున్నా.. తెలుగు, హిందీలో ఆ మూవీ రాబట్టిన వసూళ్లను ఇప్పటివరకు మరో సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ఇక ఆర్ఆర్ఆర్‌నే ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. అందునా టాప్ హీరోలైన ఎన్టీఆర్, చెర్రీలు కలిసి మొదటిసారిగా నటిస్తున్న ఈ చిత్రం బాహుబలి రికార్డులను తిరిగి రాయడం ఖాయమని.. వారి వారి అభిమానులతో పాటు ట్రేడ్ పండితులు బలంగా నమ్ముతున్నారు.
అంతేకాదు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ ఆర్ఆర్ఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్‌తో పోటీ పడేందుకు పెద్దగా ఇష్టం లేని అక్కడి హీరోలు ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కానీ టాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నా.. దీనికి పోటీ ఇచ్చేందుకు మిగిలిన హీరోలు సిద్ధమవుతున్నట్లు టాక్. మరి వచ్చే సంక్రాంతికి ఎలాంటి పోటీ ఉండబోతోంది..? ఆర్ఆర్ఆర్‌తో ఎవరెవరు పోటీ పడబోతున్నారు..? బాహుబలి రికార్డులను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేస్తుందా..? అనే వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.