పవన్ మూవీ విడుదలయ్యేది అప్పుడే: దిల్ రాజు
దాదాపు రెండేళ్ల తరువాత పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మొదటగా పింక్ రీమేక్‌లో ఆయన నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీలో పవన్.. లాయర్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీపై నిర్మాత దిల్ రాజు తాజాగా స్పందించారు. ఈ ఉదయం నైవేద్యవిరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న దిల్ […]
దాదాపు రెండేళ్ల తరువాత పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మొదటగా పింక్ రీమేక్‌లో ఆయన నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీలో పవన్.. లాయర్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీపై నిర్మాత దిల్ రాజు తాజాగా స్పందించారు. ఈ ఉదయం నైవేద్యవిరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న దిల్ రాజు.. అనంతరం మాట్లాడారు.
‘‘పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. మార్చిలో ట్రైలర్‌లో, సినిమా మేలో విడుదల కానుంది’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలాగే మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు నటిస్తోన్న వి మూవీ ఉగాది సందర్భంగా మార్చి 25న రానుందని దిల్ రాజు తెలిపారు. తెలుగు నేటివిటికీ తగ్గట్లుగా పింక్ రీమేక్ తెరకెక్కుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే జాను సినిమా మంచి విజయాన్ని సాధించిందని, తమిళంలో హిట్ అయిన మూవీని రీమేక్ చేసినా తెలుగు ప్రజలు ఈ చిత్రాన్ని అంగీకరించారని అన్నారు. కాగా పవన్ సినిమాకు వకీల్ సాబ్, లాయర్ సాబ్ అనే టైటిళ్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీతో పవన్.. క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ నటించబోతున్నారు. వీటితో పాటు మరో రెండు చిత్రాలకు ఆయన ఒప్పుకున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.