చెర్రీపై ఇన్ఫోసిన్ ఛైర్‌పర్సన్ ప్రశంసలు.. ఎందుకంటే!
ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పెద్ద కంపెనీకి ఛైర్‌పర్సన్ అయినప్పటికీ.. ఆమె చాలా సాధారణంగా ఉంటారు. అంతేకాదు ఎంత బిజీగా గడుపుతున్నా.. అప్పుడప్పుడు సినిమాలను చూస్తూ వాటిపై తన అభిప్రాయాలను కూడా చెబుతుంటారు. భాషాబేధం లేకుండా సుధామూర్తి సినిమాలను చూస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాను చూసిన ఆమె.. ఆ మూవీపై, చెర్రీపై ప్రశంసలు కురిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధా […]
ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పెద్ద కంపెనీకి ఛైర్‌పర్సన్ అయినప్పటికీ.. ఆమె చాలా సాధారణంగా ఉంటారు. అంతేకాదు ఎంత బిజీగా గడుపుతున్నా.. అప్పుడప్పుడు సినిమాలను చూస్తూ వాటిపై తన అభిప్రాయాలను కూడా చెబుతుంటారు. భాషాబేధం లేకుండా సుధామూర్తి సినిమాలను చూస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాను చూసిన ఆమె.. ఆ మూవీపై, చెర్రీపై ప్రశంసలు కురిపించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధా మూర్తి తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఎక్కువగా ఎన్టీఆర్ గారి సినిమాలు చూసేదాన్ని. మాయా బజార్, దానవీర శూర కర్ణ సినిమాలను చూశాక.. కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అన్న అభిప్రాయం నాలో ఏర్పడింది. ఎప్పుడైనా కృష్ణుడిని స్మరించుకుంటే నాకు ఎన్టీఆరే కనిపిస్తారు. అన్నమయ్య, ఓం నమో వేంకటేశాయ సినిమాలు కూడా చూశా. ఈ మధ్యన రామ్ చరణ్ నటించిన రంగస్థలం చూశా. చాలా బాగా నచ్చింది. చరణ్ నటన అద్భుతంగా ఉంది. మనం కూడా చూశా. కన్నడ సినిమాలు ఎక్కువగా చూస్తుంటా అని చెప్పుకొచ్చారు.
కాగా రంగస్థలం మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. సమంత, ఆది, జగపతిబాబు, ప్రకాష్ రాజు, అనసూయ తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం 2018 మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద నాన్‌బాహుబలి రికార్టును తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో చెర్రీ నటనకు విమర్శకులతో పాటు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు రావడంతో పాటు పలు అవార్డులు కూడా వచ్చాయి. అంతేకాదు చెర్రీ కెరీర్‌లో ఓ ల్యాండ్ మార్క్‌గా రంగస్థలం నిలిచిపోయింది.