AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయిన మెగా అభిమాని కుటుంబానికి చరణ్ భారీ ఆర్థిక సాయం..

నెల రోజుల క్రితం హైదరాబాద్‌ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్‌ చిరంజీవి సికింద్రాబాద్‌లోని వారి ఇంటికి స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నూర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వచ్చారు. అప్పుడు విదేశాలలో ఉన్న రామ్‌చరణ్‌ తను హైదరాబాద్ రాగానే నూర్ మహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాట […]

చనిపోయిన మెగా అభిమాని కుటుంబానికి చరణ్ భారీ ఆర్థిక సాయం..
Ram Naramaneni
|

Updated on: Feb 09, 2020 | 6:06 PM

Share

నెల రోజుల క్రితం హైదరాబాద్‌ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్‌ చిరంజీవి సికింద్రాబాద్‌లోని వారి ఇంటికి స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నూర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వచ్చారు. అప్పుడు విదేశాలలో ఉన్న రామ్‌చరణ్‌ తను హైదరాబాద్ రాగానే నూర్ మహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు. కాగా ఈ రోజు (ఆదివారం) ఉదయం నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులకు  రామ్ చరణ్  10లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఈ సహాయం మరువలేనిదని, ఎన్నటికీ రుణపడి ఉంటామని వారు రామ్‌చరణ్‌కు తెలిపారు.

‘నూర్ మహ్మద్ తమ కుటుంబం పేరుతో చేసిన సేవలు ఎనలేనివి. ముఖ్యంగా ఆయన చేసే కార్యక్రమాలు మేము చూడాలని, మాకు తెలియాలని ఎప్పుడు కోరుకోకుండా మా పుట్టినరోజులకు, సినిమా ఫంక్షన్లకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు’ అని రామ్ చరణ్ అన్నారు.  దాదాపు 45 నిముషాలు నూర్ మహ్మద్ కుటుంబంతో చెర్రీ గడిపారు. ఆయన చేసిన సేవలను రామ్ చరణ్ విశేషంగా కొనియాడారు. నూర్ మహ్మద్ గారిని తిరిగి తీసుకొని రాలేనని, కానీ వారి ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటానని తెలిపారు. అదే విధంగా నూర్ మహ్మద్ కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని,  అమ్మాయిల పెళ్లిళ్లకు తను స్వయంగా వస్తానని ఆ కుటుంబానికి చెర్రీ భరోసా ఇచ్చారు.

Follow Us
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌