AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్‌ 13 ఉదయం అందుబాటులో ఉన్న ధరల వివరాల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,49,670, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,190గా నమోదైంది. వెండి కిలో ధర దేశీయంగా రూ.2,39,900గా ఉంది.

బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: Oct 13, 2026 | 6:39 AM

Share

గత కొంతకాలం నుంచి బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ఒక్కోసారి బంగారం ధర పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు.. ఇలా అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.. కాగా.. రికార్డు స్థాయికి వెళ్లి.. కాస్త తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. సోమవారం కొంతమేర తగ్గాయి.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం అక్టోబర్ 13 ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ10 మేర తగ్గి రూ.1,49,670 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 తగ్గి.. రూ.1,37,190 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,39,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,670, 22 క్యారెట్ల ధర రూ.1,37,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,670 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,670, 22 క్యారెట్ల ధర రూ.1,37,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,670, 22 క్యారెట్ల ధర రూ.1,37,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,670, 22 క్యారెట్ల ధర రూ.1,37,190 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,670, 22 క్యారెట్ల ధర రూ.1,37,190 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us