అక్టోబర్ 13 రాశి ఫలాలు: ఆ రాశుల వారికి ధనలాభం, కొత్త ఉద్యోగ అవకాశాలు..
Horoscope Today (October 13, 2026): మంగళవారం 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ, వృత్తి పరంగా ప్రోత్సాహకాలు, ఆదాయ వృద్ధి కనిపిస్తాయి. మిథున రాశి నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. మరి మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండనుందో తెలుసుకుందాం.

దిన ఫలాలు (అక్టోబర్ 13, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అయితే ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చాలావరకు చక్కబెడతారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఆవేశకావేషాలకు ఇది సమయం కాదు. కుటుంబం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కొన్ని కష్టనష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం మంచిది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గు తాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆస్తి విషయాల్లో బంధుమిత్రులు సహాయం అందిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగులకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఆచితూచి వ్యవ హరించడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో సత్ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు బాగా సహాయం చేస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాబాల బాట పడతాయి. ఎక్కువ కాలం పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. చేపట్టిన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. రావలసిన డబ్బును వసూలు చేసుకోవడం మీద దృష్టి పెడతారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశముంది. వ్యాపారులు కొత్త వ్యూహాలతో లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి తేలికగా పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగుల ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశిం చిన రాబడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఇష్టమైన ఆలయాలు సంద ర్శిస్తారు. ఆస్తి వ్యవహా రాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను అతి కష్టం మీద పూర్తి చేస్తారు. కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ముఖ్యమైన వ్యవ హారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను ఆక ట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉచిత సహాయాలు, దానధర్మాలు తగ్గించుకోవడం మంచిది. బంధు మిత్రులకు ఆర్థికసహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అవసర విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. ఆదాయం పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోకుండా బాకీలు, బకాయిలు వసూలవుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అదనపు బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అతి కష్టం మీద ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. స్నేహితుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
Also Read: శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్..



