Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Prakash: సౌందర్య నా గురించి చిరంజీవికి కంప్లెయింట్ చేశారు.. సంచలన విషయం చెప్పిన సత్య ప్రకాష్

ముఖ్యంగా సాయి కుమార్ లాంటి హీరోల సినిమాల్లో సత్య ప్రకాష్ ఎక్కువగా నటించారు. గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సత్య ప్రకాష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Satya Prakash: సౌందర్య నా గురించి చిరంజీవికి కంప్లెయింట్ చేశారు.. సంచలన విషయం చెప్పిన సత్య ప్రకాష్
Staya Prakash , Soundarya
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 02, 2022 | 12:22 PM

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ విలన్స్ లో సత్య ప్రకాష్ ఒకరు.. విలన్ చేష్టలు ఇలా కూడా ఉంటాయా అనేంతలా నటించి ప్రేక్షకులను మెప్పించారు సత్య ప్రకాష్. ముఖ్యంగా సాయి కుమార్ లాంటి హీరోల సినిమాల్లో సత్య ప్రకాష్ ఎక్కువగా నటించారు. గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సత్య ప్రకాష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలోకి సులువు గానే వచ్చిన సత్య ప్రకాష్ నటుడిగా స్థిరపడడానికి చాలా కష్టపడ్డారు. తపనతో చిన్న చిన్న వేషాల దగ్గరనుంచి మెయిన్ విలన్ గా ఎదిగారు. విలన్ పాత్రలు పోషించిన వారందరిలో సత్య ప్రకాష్ నటన చాలా విభిన్నంగా ఉంటుంది. ఒక్కనొక ఇంటర్వ్యూలో సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. హీరోయిన్ సౌందర్య తన పై మెగాస్టార్ చిరంజీవికి కంప్లెయింట్ చేశారని చెప్పారు.

గతంలో వెంకటేష్ హీరోగా నటించిన పెళ్లి చేసుకుందాం అనే సినిమాలో హీరోయిన్ గా సౌందర్య నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్యను లాగి వ్యాన్ లోకి ఎక్కించే సీన్ ఉందట.. ఆ సీన్ చేసింది సత్య ప్రకాష్. ఆ సీన్ సినిమాకె మూలం. ఆ సీన్ తోనే సినిమా కథ అంతా మారిపోతుంది. ఆ సినిమాను జనాలు బాగా ఆదరించారు. ఇప్పటికి ఆసీన్ ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు.

ఆ తర్వాత ఆ తర్వాత చిరంజీవి సౌందర్య కాంబినేషన్ లో చూడాలని ఉంది సినిమా చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే.. చిరంజీవి గారిని కలవాలని అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో చిరంజీవి గారు సౌందర్య ఒకే దగ్గర కూర్చున్నారు. నేను వెళ్ళగానే సౌందర్య గారు.. నా కెరీర్ లో ఒక సినిమాలో ఒక సంఘటన జరిగింది. దానికి కారణం ఈయనే అని చెప్పారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.. ఆమె వెంటనే నావేసి పెళ్లి చేసుకుందాం సినిమా గురించి చెప్పారు. దాంతో చిరంజీవి గారు కూడా నవ్వారు. ఆ తర్వాత నన్ను పిలిచి షూటింగ్ కు ఎలా వస్తున్నావ్ ఆ ని అడిగారు స్కూటర్ పైన వస్తున్నా అని చెప్పను.. హెల్మెట్ పెట్టుకుంటున్నావా..? లేదు అని చెప్పా .. హెల్మెట్ పెట్టుకో మంచి నటుడివి అవుతావు అంటూ ప్రోత్సహించారు అని గుర్తు చేసుకున్నారు సత్య ప్రకాష్.

ఇవి కూడా చదవండి