Manchi Rojulochaie : ‘మంచి రోజులొచ్చాయి’ నుంచి అందమైన మెలోడీ వచ్చింది.. అద్భుతంగా ఆలపించిన సిద్ శ్రీరామ్..

చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌‌గా గోల్కొండ హైస్కూల్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంతోష్ శోభన్. ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. తాను నేను అనే సినిమాతో హీరోగా మారిన సంతోష్.

Manchi Rojulochaie : 'మంచి రోజులొచ్చాయి' నుంచి అందమైన మెలోడీ వచ్చింది.. అద్భుతంగా ఆలపించిన సిద్ శ్రీరామ్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 16, 2021 | 10:02 PM

Manchi Rojulochaie: చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌‌గా గోల్కొండ హైస్కూల్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంతోష్ శోభన్. ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. తాను నేను అనే సినిమాతో హీరోగా మారిన సంతోష్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నాడు. ఆతర్వాత పేపర్ బాయ్ అనే సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. పేపర్ బాయ్ సినిమా పర్లేదు అనుపించుకున్నా సంతోష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవల ఏక్ మినీ కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. కరోనా కల్లోలం కారణంగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ మూవీ మంచి టాక్‌‌‌ను సొంతం చేసుకోవడమే కాకుండా సంతోష్‌‌‌ను నటుడిగా మరో మెట్టు పైకెక్కించింది. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సంతోష్ శోభన్. ఈ సినిమాకు మంచి రోజులొచ్చాయి అనే టైటిల్‌‌‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమానుంచి పోస్టర్లు, పాటలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. కామెడీని బేస్ చేసుకొని సరికొత్త కథనంతో సినిమాలు చేస్తుంటాడు మారుతి. నాని నటించిన భలే భలే మగాడివోయ్, శర్వానంద్ నటించిన మహానుభావుడు వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు మారుతి. రీసెంట్‌‌‌గా మెగా హీరో సాయి తేజ్ నటించిన ప్రతిరోజు పండగే సినిమాతో మరో హిట్‌‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మంచి రోజులొచ్చాయి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్‌ను వదిలారు. సాయితేజ్ చేతుల మీదుగా రిలీజ్ అయినా ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ అందమైన ప్రేమ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ‘సో సో గా ఉన్నాననీ.. సో స్పెషలే చేశావులే’ అంటూ ఈ పాట సాగుతుంది. ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు..వైరల్ అవుతున్న వీడియో..:Supritha Video.

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..