Vijay Deverakonda: దేవరకొండ ఇంట్లో సంక్రాంతి సంబరాలు.. సంప్రదాయ దుస్తుల్లో విజయ్.. ఆనంద్..
ఇదిలా ఉంటే.. దేవరకొండ ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కుటుంబంతో కలిసి పండుగను జరుపుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విజయ్ షేర్ చేసిన ఫోటోలలో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. వీర్దదరు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉండే పాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఇక ఇటీవలే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇందులో రౌడీ హీరో పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లుగా ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దేవరకొండ ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కుటుంబంతో కలిసి పండుగను జరుపుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విజయ్ షేర్ చేసిన ఫోటోలలో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. వీర్దదరు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
ఇంటి బయట కట్టెల పొయ్యి మీద పాలు పొంగించిన ఫోటోస్ సైతం పంచుకున్నారు. ఎప్పుడూ ట్రెండీ లుక్ లో కనిపించి విజయ్.. ఇలా సంప్రదాయ పంచెకట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం బేబీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.