Sitara Ghattamaneni: ‘బంగారు కళ్ల బుచ్చమ్మో.. కోపంలో ఎంత ముద్దమ్మో’.. సితార ఎంత క్యూట్‌గా ఉందో చూశారా ?..
శనివారం తన సోదరి భారతి ఘట్టమనేనితో కలిసి హాలీవుడ్ మ్యూజిక్కు స్టెప్పులేసిన సితార.. సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. తాజాగా షేర్ చేసిన వీడియోలో ఎరుపు రంగు పట్టు పరికిణిలో సితార ఎంతో ముద్దుగా ఉంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని. సోషల్ మీడియాలో ఈ చిన్నారికి ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. సీతూపాప మల్టిటాలెంటెడ్. డాన్స్, పెయింటింగ్, సంప్రదాయ నృత్యంలో.. ఇలా అన్నింటిలోనూ సితార ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవాలి. ఇక నెట్టింట్లో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. ఇక శనివారం తన సోదరి భారతి ఘట్టమనేనితో కలిసి హాలీవుడ్ మ్యూజిక్కు స్టెప్పులేసిన సితార.. సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. తాజాగా షేర్ చేసిన వీడియోలో ఎరుపు రంగు పట్టు పరికిణిలో సితార ఎంతో ముద్దుగా ఉంది. ప్రస్తుతం మహేష్ తనయ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో అచ్చ తెలుగమ్మాయిగా కనిపిస్తుంది సీతూపాప.
బ్యాగ్రౌండ్‍లో మహేష్ బాబు నటించిన మురారి సినిమాలోని బంగారు కళ్ల బుచ్చమో.. కోపంలో ఎంతో ముద్దమ్మో.. అంటూ సాంగ్ రావడం.. అందుకు తగినట్టుగా సీతూపాప ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి. ఇక సితార షేర్ చేసిన వీడియోకు మహేష్ సతీమణి నమ్రత రియాక్ట్ అయ్యారు. నా చిట్టి దేవత.. నీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
ఇక శనివారం మహేష్ బాబు సోదరుడు దివంగత నటుడు రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేనితో కలిసి హాలీవుడ్ పాటకు అందంగా స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. అందులో ఇద్దరూ ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ఎంతో క్యూట్ గా చక్కగా డాన్స్ చేశారు. వీరిద్దరు కలిసి ఇలా డాన్స్ చేయడం చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ వీడియోకు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.