AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: నిర్మాతగా కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన నిహారిక కొణిదెల.. హీరో ఎవరంటే..?

ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్తవారే కావటం విశేషం. తాజాగా నిర్మాతగా మరో సినిమా అనౌన్స్ చేశారు నిహారిక.

Niharika Konidela: నిర్మాతగా కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన నిహారిక కొణిదెల.. హీరో ఎవరంటే..?
Niharika Konidela
Ram Naramaneni
|

Updated on: Apr 02, 2025 | 3:47 PM

Share

తాజాగా నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ట్యాలెంటెడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో వెల్లడికానున్నాయి.

ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు.

తాజాగా ప్రకటించిన చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) పిఆర్వోగా, టికెట్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!