Samantha: క్యూట్ స్మైల్‏తో మైమరపిస్తోన్న అందాల భామ.. సమంత లేటెస్ట్ లుక్ చూశారా ?..

. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి చిత్రంలో నటిస్తుంది.ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అయితే శాకుంతలం సినిమాతో ప్లాపును ఖాతాలో వేసుకున్న సామ్ ఆశలన్నీ ఇప్పుడు ఖుషి చిత్రంపైనే ఉన్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ మూవీ కోసం ఇటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Samantha: క్యూట్ స్మైల్‏తో మైమరపిస్తోన్న అందాల భామ.. సమంత లేటెస్ట్ లుక్ చూశారా ?..
Samantha Birthday
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 28, 2023 | 5:42 PM

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఇటీవలే శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేసింది సామ్. ఈ క్రమంలోనే ఆమె కొద్ది రోజులుగా సిటాడెల్ వెబ్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటుంది. దీంతోపాటు.. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి చిత్రంలో నటిస్తుంది.ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అయితే శాకుంతలం సినిమాతో ప్లాపును ఖాతాలో వేసుకున్న సామ్ ఆశలన్నీ ఇప్పుడు ఖుషి చిత్రంపైనే ఉన్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ మూవీ కోసం ఇటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సామ్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 28న ఖుషి చిత్రం నుంచి సమంత స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సామ్ క్యాజువల్ లుక్ లో చుడీదార్ తో మెడలో ఐడీకార్డ్ వేసుకుని ఆఫీస్ కు వెళ్తున్న ఒక ఉద్యోగినిగా కనిపిస్తోంది. ముఖ్యంగా అందులో సామ్ స్మైల్ ఆమెకు మరింత అందాన్ని తీసుకొచ్చే విధంగా ఉంది. అయితే తాజాగా విడుదలైన పోస్టర్ బట్టి చూస్తుంటే.. ఇందులో సామ్ మిడిల్ క్లాస్ అమ్మాయి తరహా పాత్రలో కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ బట్టి చూస్తే.. ఈ సినిమాలో రెండు భిన్నమైన ఆర్థిక అంతస్తుల మధ్య పెరిగిన అమ్మాయి.. అబ్బాయి ప్రేమకథగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరీ.. ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని సామ్ అందుకుంటుందా ? అనేది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.