Dimple Hayathi: ‘వల్గారిటీ అంటే ఏంటీ ?’.. రిపోర్టర్ ప్రశ్నను సీరియస్‌గా తీసుకున్న డింపుల్ ఏకంగా..
మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరోయిన్ డింపుల్ హయాతిని ఓ సీనియర్ రిపోర్టర్ ఈ చిత్రంలో మీ రోల్ వల్గర్ గా అనిపించింది. దానికి మీరేమంటారు అంటూ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వల్గర్ అన్న పదం వినగానే డింపుల్ షాకయ్యింది. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కానీ సమయంలో డైరెక్టర్ శ్రీవాస్ కలుగజేసుకుని సరైన ఆన్సర్ ఇచ్చారు.
ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లలో హీరోయిన్స్ ఇబ్బందికి గురవుతున్న సంగతి తెలిసిందే. కొందరు విలేకర్లు అడుగుతున్న ప్రశ్నలతో హీరోహీరోయిన్స్ అసహనానికి గురవుతున్నాయి. అయితే ఆ ప్రశ్నలకు అక్కడే సమాధానం చెప్పినా.. సోషల్ మీడియా వేదికగా మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. గతంలో డీజే టిల్లు సినిమా ప్రెస్ మీట్ లోనూ జరిగిన సంఘటనే ఇటీవల రామబాణం చిత్రయూనిట్‌కు ఎదురైంది. ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరోయిన్ డింపుల్ హయాతిని ఓ సీనియర్ రిపోర్టర్ ఈ చిత్రంలో మీ రోల్ వల్గర్ గా అనిపించింది. దానికి మీరేమంటారు అంటూ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వల్గర్ అన్న పదం వినగానే డింపుల్ షాకయ్యింది. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కానీ సమయంలో డైరెక్టర్ శ్రీవాస్ కలుగజేసుకుని సరైన ఆన్సర్ ఇచ్చారు.
ఆ తర్వాత డింపుల్ మాట్లాడుతూ.. సినిమాలో ఎక్కడా వల్గర్ సీన్స్ చూడలేదు.. గ్లింప్స్ కూడా అలాంటివేమి వదల్లేదు అనుకుంటున్నాను. పాటలలో, పోస్టర్లలో నేను శుభ్రంగానే ఉన్నారు. కానీ మీరు వల్గర్ అంటే నిజంగా అర్థం కావడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇక ఈ విషయాన్ని డింపుల్ సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. వల్గారిటీ అంటే ఏంటీ ? అంటూ గూగుల్ సెర్చ్ చేసినట్లు ఓ స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాలో స్టేటస్ పెట్టింది. దీంతో డింపుల్ షేర్ చేసిన పిక్ క్షణాల్లో వైరల్ కాగా.. ఆమె సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్స్.
వల్గర్ అనే పదం వాడడం పై డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ.. ఎక్కడ ఏ పదం వాడాలో తెలియక వల్గర్ అంటున్నారు. ఆమె అర్థమయ్యేలా చెప్పలేకపోతుంది. చెప్పడం వస్తే ఇంకా బాగా మాట్లాడుతుంది. ప్రమోషన్లకు ఆమె వేసుకొచ్చిన డ్రెస్ చూస్తుంటే ఆమె చేసిన క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది.. ఇది ట్రెడిషనల్ సినిమా. సంప్రదాయ దుస్తుల్లోనే ప్రమోషన్స్ కు వస్తుంది. వీటిని బట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ అర్థం చేసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.