Samantha: భగవద్గీత చదువుతున్న సమంత.. వైరలవుతోన్న ఇన్స్టా పోస్ట్..
ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంది. అలాగే తీసుకున్న రెమ్యూనరేషన్స్ వెనక్కు ఇచ్చేసింది. అయితే కొద్ది రోజులు సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే ఇన్ స్టా స్టోరీలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది. క్రమంలో తాజాగా భగవద్గీత చదువుతున్న ఫోటోస్ షేర్ చేసింది. అంతేకాదు.. ఏ భాగాన్ని చదువుతుందో చూపించింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్నంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటూ మయోసైటిస్ చికిత్స కోసం సిద్ధమవుతుంది. త్వరలోనే విదేశాల్లో సామ్ చికిత్స తీసుకోనుంది. దీంతో ఇప్పుడు పూర్తిగా తన హెల్త్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంది. అలాగే తీసుకున్న రెమ్యూనరేషన్స్ వెనక్కు ఇచ్చేసింది. అయితే కొద్ది రోజులు సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే ఇన్ స్టా స్టోరీలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది. క్రమంలో తాజాగా భగవద్గీత చదువుతున్న ఫోటోస్ షేర్ చేసింది. అంతేకాదు.. ఏ భాగాన్ని చదువుతుందో చూపించింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించింది సామ్. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సామ్, విజయ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే ఇందులోని సాంగ్స్ సైతం మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేశాయి.ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న సామ్.. కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే మూవీ అప్డేట్స్ పంచుకుంది. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్.. మరికొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంది ఖుషి చిత్రం. విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి, గీతాగోవిందం తర్వాత ఆస్థాయిలో ప్రేక్షకులను మెప్పించిన చిత్రం ఇదే కావడం విశేషం.
ఇక సామ్ నటించిన సిటాడెల్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ మూవీలో సామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించినట్లుగా తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సిటాడెల్ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ వస్తోంది.
View this post on Instagram
అలాగే సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుందని టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ జోడిగా సామ్ నటించనుందనే వార్తలు బీటౌన్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ చిత్రంలో సమంత పేరుతోపాటు.. త్రిష, అనుష్క పేర్లు కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.