Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: థియేటర్‌లో డిజాస్టర్‌.. ఓటీటీలో సూపర్‌ హిట్‌. ఏకంగా టాప్‌-1 ట్రెండింగ్‌లో

ఈ క్రమంలోనే థియేటర్లలో పెద్దగా ఆడని చిత్రాలు సైతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ప్రేక్షకాధరణతో దూసుకుపోతున్నాయి. తాజాగా థియేటర్లలో డిజాస్టర్‌ అయిన ఓ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటనేగా మీ సందేహం. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన రామబాణం సినిమానే. థియేటర్లలో భారీ డిజాస్టర్‌గా నిలిచిందీ సినిమా. అయితే తాజాగా...

OTT: థియేటర్‌లో డిజాస్టర్‌.. ఓటీటీలో సూపర్‌ హిట్‌. ఏకంగా టాప్‌-1 ట్రెండింగ్‌లో
Gopichand Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 17, 2023 | 2:42 PM

ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా చూసే విధానమే మారిపోయింది. పెద్ద పెద్ద స్క్రీన్స్‌తో కూడిన టీవీలు అందుబాటులోకి రావడం, మంచి క్వాలిటీతో కూడిన సౌండ్‌ సిస్టమ్‌లు అందుబాటులోకి రావడంతో జనాలు థియేటర్లకు బదులు ఓటీటీల్లో సినిమాలు చూడడం ఎక్కువవుతోంది. దీంతో సినిమా మేకర్స్ సైతం భారీ మొత్తానికి ఓటీటీ హక్కులను కొనుగోలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే థియేటర్లలో పెద్దగా ఆడని చిత్రాలు సైతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ప్రేక్షకాధరణతో దూసుకుపోతున్నాయి. తాజాగా థియేటర్లలో డిజాస్టర్‌ అయిన ఓ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటనేగా మీ సందేహం. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన రామబాణం సినిమానే. థియేటర్లలో భారీ డిజాస్టర్‌గా నిలిచిందీ సినిమా. అయితే తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ రికార్డు వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ఏకంగా నెట్‌ ఫ్లిక్స్‌లో టాప్‌-1 ట్రెండింగ్‌లో నిలిచింది. సినిమా విడుదలైన దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సినిమా దుమ్మురేపుతోంది.

సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా టాప్‌ వన్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో మాత్రం ఊహించని రెస్పాన్స్‌ అందుకుంటోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టి. విశ్వ ప్రసాద్‌ నిర్మించిన చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని సుమారు రూ. 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

రామబాణం ట్రైలర్…

రోటీన్‌ కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఓటీటీ విడుదలను కూడా వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా నాలుగు నెలల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10 మూవీస్‌లో రామబాణం మొదటి స్థానంలో నిలిచింది.

రామబాణం ఓటీటీ…

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..