15 బ్రాండ్స్‌కు నో చెప్పి కోట్లు వదులుకున్నా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
చాలా మంది సెలబ్రెటీలు.. సినిమాలతో పాటు యాడ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తుంటారు. కొంతమంది ఏకంగా పదుల సంఖ్యలో యాడ్స్ లో నటిస్తూ కోట్లకు వెనకేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ బ్రాండ్ ప్రమోషన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను 15 బ్రాండ్స్ ను వదిలేసినట్టు తెలిపింది. దానివల్ల కోట్లు నష్టపోయాను అని తెలిపింది.

సినీ సెలబ్రటీలు కేవలం సినిమాలతోనే కాదు ఇతర బిజినస్ లలోనూ రాణిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కొంతమంది సినిమాలతో పాటు యాడ్స్ లోనూ నటిస్తున్నారు. సినిమాల మాదిరిగానే యాడ్స్ ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్నారు. రెండు మూడు నిమిషాల యాడ్స్ కోసం కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం యాడ్స్ మిస్ చేసుకొని కోట్లల్లో నష్టపోయాను అని తెలిపింది. ఆ యాడ్స్ చేసి ఉంటే తనకు కోట్లల్లో డబ్బు ముట్టేదని తెలిపింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె సౌత్ లో ఓ సెన్సేషన్స్.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తుంది. ఒకొక్క సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ అందుకునే ఆ స్టార్ హీరోయిన్ ఏకంగా 15 బ్రాండ్స్ కు నో చెప్పాను అని తెలిపింది. ఆమె ఎవరంటే..
సినీ సెలబ్రెటీలు బ్రాండ్ ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. హీరోలకు సమానంగా హీరోయిన్స్ కూడా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ సమంత కూడా ఎన్నో యాడ్స్ లో నటించింది. అలాగే పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. 15 బ్రాండ్స్ కు నో చెప్పినట్టు తెలిపింది. ఆ బ్రాండ్స్ కు నో చెప్పడం వల్ల తాను కోట్లు నష్టపోయాను అని తెలిపింది సామ్.
తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిరోజూ నా లక్ష్యం మెరుగ్గా ఉండటమే.. తెలివిగా ఏదైనా ఎంచుకోవడం నేర్చుకున్నా.. నేను నాకు 20ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా.. నేను సక్సెస్ అయిన తర్వాత చాలా యాడ్ ఆఫర్స్ వచ్చాయి. పెద్ద పెద్ద బ్రాండ్స్ నన్ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఆఫర్స్ ఇచ్చారు. నేను దీనిని గుర్తింపు, కీర్తికి చిహ్నంగా భావించాను. కానీ కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం వల్ల నష్టం చేకూరుతుంది.
“నేను చిన్నప్పుడు, నా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గుర్తించక ముందు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకున్నాను. అలాగే ఈ బ్రాండ్‌లను నేనే ఎక్కువగా తినేదాన్ని. దాని వల్ల ఎటువంటి పరిణామాలు ఉండవని అనుకున్నాను. కానీ నేడు, నేను తప్పు చేయకూడదని గ్రహించాను. నా ఎంపికలపై నేను దాదాపు ఆత్మపరిశీలన చేసుకోవలసి వచ్చింది. నా చిన్నతనంలో నేను అన్ని అర్ధంలేని పనులు చేసినందుకు నాకు నేను క్షమాపణ చెప్పాలని భావిస్తున్నాను. అందుకే నా అభిమానులను కూడా మీకు మీరు ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవద్దు అని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను అని తెలిపింది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న యాడ్స్ గురించి ఆమె మాట్లాడుతూ, “ఇవి చాలా కాలం క్రితం చేసిన ఎండార్స్‌మెంట్‌ల నుంచి వచ్చిన యాడ్స్. గత సంవత్సరం నేను దాదాపు 15 ఎండార్స్‌మెంట్‌లను తిరస్కరించాను . దాని వల్ల నేను కోట్లు నష్టపోయాను. నేను ఇప్పుడు ఏదైనా బ్రాండ్‌లను ప్రమోట్ చేయడానికి ముందు ముగ్గురు వైద్యులతో తనిఖీ చేస్తాను” అని సమంత చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..