Actress Samantha: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. వైరల్ అవుతున్న సమంత ఓల్డ్ పోస్ట్..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Oct 07, 2021 | 2:35 PM

సమంత -నాగచైతన్య విడిపోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి .. ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ చూసిన దీనిగురించే చర్చ జరుగుతుంది.

Actress Samantha: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి'.. వైరల్ అవుతున్న సమంత ఓల్డ్ పోస్ట్..
Samantha

Follow us on

సమంత -నాగచైతన్య విడిపోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి .. ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ చూసిన దీనిగురించే చర్చ జరుగుతుంది. సమంత- నాగచైతన్య ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే.. చైతన్య- సమంతది దాదాపు ఏడేళ్ల బంధం. ఇక విడాకులు అనౌన్సచేసిన తర్వాత సమంత వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ వస్తుంది. ఇండైరెక్ట్‌గా తన పోస్ట్‌లతో ఎదో చెప్పాలని చూస్తుంది సమంత. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఇది తాజాగా చేసిన పోస్ట్ కాదు.. పెళ్ళి రోజు సందర్భంగా సమంత ఎంతో ఎమోషనల్‌గా చేసిన పోస్ట్ .. అదేంటే..

2017 అక్టోబర్‌ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. అంత సవ్యంగా ఉండుంటే నేడు ఈ జంట ఘనంగా పెళ్లిరోజు జరుపుకునేవారు.. ఈక్రమంలో సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. గత ఏడాది ఇదే రోజున తమ పెళ్లిరోజు సందర్భంగా సామ్ చైతన్యతో కలిసి ఉన్న ఫొటోతో పాటు.. ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఇక పై జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం..  హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌’’ అని పోస్ట్ చేసింది సామ్. ఇప్పుడు ఈపోస్ట్ వైరల్ గా మారింది. ఇక సమంత నాగచైతన్య విడిపోతున్నారని గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ఇద్దరు తమ వివాహబంధానికి ముగింపు పలుకుతూ.. సోషల్ మీడియా వేదికగా తాము విడిడిపోతున్నామని ప్రకటించారు. సమంత నాగచైతన్య విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

సమంత పోస్ట్ ..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aryan Khan Drugs Case: ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీలో అసలు నిజాలేంటి ? షారూఖ్‌ కొడుకు అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందా?

 Nizamabad: మరో ఘోరం.. నిజామాబాద్ టౌన్‌లో ఇద్దరు బాలికలపై మృగాడి దుర్మార్గం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu