AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత రేంజ్ ఇది.. ఆ విషయంలో నెంబర్ వన్‏గా సామ్ రికార్డ్..

కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అమెరికాలో ఉన్న సామ్.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంది. ఇక తాజాగా సమంత సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సామ్ ఇన్ స్టా ఫాలోవర్స్ 3 కోట్లకు చేరింది. దాదాపు 30 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా సమంత రికార్డ్ క్రియేట్ చేసింది.

Samantha: సమంత రేంజ్ ఇది.. ఆ విషయంలో నెంబర్ వన్‏గా సామ్ రికార్డ్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2023 | 4:44 PM

Share

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చివరిసారిగా ఖుషి చిత్రంలో నటించిన సామ్.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అంతేకాదు..ఇప్పటికే తీసుకున్న రెమ్యూనరేషన్స్ తిరిగి ఇచ్చేసిందట. అయితే మయోసైటిస్ కోసం సామ్ అమెరికాలో చికిత్స తీసుకోనుందని.. అందుకే సినిమాలు ఒప్పుకోలేదని ప్రచారం నడించింది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ సామ్ కొద్ది రోజులుగా అమెరికాలో విశ్రాంతి తీసుకుంటుంది. మరోవైపు సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జోడిగా సామ్ నటించనుందని.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్ నడుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అమెరికాలో ఉన్న సామ్.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంది. ఇక తాజాగా సమంత సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సామ్ ఇన్ స్టా ఫాలోవర్స్ 3 కోట్లకు చేరింది. దాదాపు 30 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా సమంత రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా తన సంతోషాన్ని ఇన్ స్టాలో వ్యక్తం చేస్తూ ఓ అందమైన ఫోటోను షేర్ చేసింది సామ్.

సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఇమేజ్ సొంతం చేసుకుంది సామ్. అంతేకాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. వెండితెరపైనే కాకుండా ఇటు ఓటీటీలోనూ సందడి చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నెగెటివ్ షేడ్ ఉన్న రాజీ పాత్రలో నటించి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. దీంతో సమంతకు మరో అవకాశం వచ్చింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ జోడిగా సిటాడెల్ చిత్రంలో నటించింది. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే.. గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో సామ్ షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంది. అటు సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది సామ్. సోషల్ మీడియా అన్ని ప్రధాన ప్లాట్ ఫారమ్స్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న భారతీయ సినీ ప్రముఖులతో సమంత పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం సామ్ కు ఇన్ స్టాలో 30 మిలియన్స్ మంది ఫాలోవర్స్ కలిగి మరో రికార్డ్ ఖాతాలో వేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.