AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Subham Collections: ‘శుభం’ సినిమా మొదటి రోజు కలెక్షన్లు.. సమంత సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

చాన్నాళ్ల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. స్వీయ నిర్మాణంలో సామ్ నటించిన తాజా చిత్రం శుభం. శుక్రవారం (మే 09) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

Subham Collections: 'శుభం' సినిమా మొదటి రోజు కలెక్షన్లు.. సమంత సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Subham Movie
Basha Shek
|

Updated on: May 10, 2025 | 6:01 PM

Share

సమంత నిర్మాతగా వ్యవహరించిన మొదటి సినిమా శుభం. ఇందులో సామ్ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై ముందు నుంచి పాజిటివ్ ఓపీనియన్ ఉంది. దీనికి తోడు సమంత నిర్మాత కావడం, ప్రమోషన్లు కూడా గట్టిగా నిర్వహించడంతో శుభం సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేశారు. ఇక శుక్రవారం శుభం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ లేకున్నా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు రూ.1.5 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమా హారర్ థ్రిల్లర్ జానర్ కాబట్టి మెల్లగా కలెక్షన్లు పుంజుకునే అవకాశముంది. వీకెండ్ కు తోడు వేసవి సెలవులు కూడా కలిసి వస్తే సమంత సినిమా త్వరగానే లాభాల్లోకి వెళ్లిపోవచ్చు.

ఇవి కూడా చదవండి

‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన శుభం సినిమాలోహర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పెరి, శ్రియ కొంతం, శర్వాణి లక్ష్మీ, షాలిని కొండెపూడి, వంశీధర్‌ గౌడ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ట్రాలాలా మూవీంగ్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై సమంత ఈ సినిమాను నిర్మించింది. క్లింటన్‌ సిరీజో స్వరాలు సమకూర్చగా, వివేక్‌ సాగర్‌ నేపథ్య సంగీతం అందించారు.

ఓవర్సీస్ లోనూ సామ్ సినిమాకు మంచి ఓపెనింగ్స్..

విజయవాడకు సమంత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు