AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సంచలనంగా మారిన సామ్ రెమ్యూనరేషన్.. సౌత్ ఇండియాలోనే సెకండ్ ప్లేస్..!

ఏ మాయ చేశావే సినిమాతో 2010లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సామ్.. అదే దూకుడుతో ముందుకు వెళ్తుంది. సమంత చివరిసారిగా అల్లు అర్జున్  పుష్ప: ది రైజ్ మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది.

Samantha: సంచలనంగా మారిన సామ్ రెమ్యూనరేషన్.. సౌత్ ఇండియాలోనే సెకండ్ ప్లేస్..!
Samantha
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2022 | 8:19 AM

Share

Tollywood: సమంత.. సౌత్ ఇండియా(South India)లో స్టార్ నటిగా దూసుకుపోతుంది. ఓ పక్క గ్లామర్ పాత్రలు.. మరోవైపు పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. పర్సనల్ లైఫ్‌లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ.. ప్రొఫెషనల్‌గా మాత్రం దూసుకుపోతుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం'(Shaakuntalam) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ‘యశోద’ చిత్రీకరణ సాగుతుంది. తమిళ్‌లో నటిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా కూడా వేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన మరో హీరోయిన్ నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో 2010లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సామ్.. అదే దూకుడుతో ముందుకు వెళ్తుంది. సమంత చివరిసారిగా అల్లు అర్జున్  పుష్ప: ది రైజ్ మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. ఆ పాటలో సామ్ అందాల విందుకు కుర్రకారు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ క్రమంలో సామ్ తన రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఆమె రెండో స్థానంలో నిలిచినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఫస్ట్ ప్లేస్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార దూసుకుపోతుంది.  అందుతోన్న సమాచారం ప్రకారం.. సామ్ ప్రజంట్ సినిమాకు  రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తుందట. ప్రొడక్షన్ హౌస్, సినిమాలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యం.. ఇతర అంశాలను బేరీజు వేసుకుని ఆమె రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట. పుష్పలో స్పెషల్ సాంగ్‌ కోసం సమంత రూ.5 కోట్లు తీసుకుందని సమాచారం.

Also Read: Radhe Shyam Twitter Review : ప్రభాస్ రేంజ్ ఇకపై పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. ‘రాధే శ్యామ్’ ట్విట్టర్ రివ్యూ