AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

samantha akkineni : సమంత నటనకు ఫిదా అయిన చిత్రయూనిట్.. ఆమె యాక్టింగ్ అమేజింగ్ అన్న నాటుడు

చేసిన పని నలుగురికీ తెలిశాక ప్రశంసలు దక్కడం వేరు. మధ్యే మార్గంలో ఉండగానే శభాష్‌... అంటూ అందరి మెప్పూ పొందడం వేరు.

samantha akkineni : సమంత నటనకు ఫిదా అయిన చిత్రయూనిట్.. ఆమె యాక్టింగ్ అమేజింగ్ అన్న నాటుడు
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2021 | 9:08 PM

Share

samantha akkineni : చేసిన పని నలుగురికీ తెలిశాక ప్రశంసలు దక్కడం వేరు. మధ్యే మార్గంలో ఉండగానే శభాష్‌… అంటూ అందరి మెప్పూ పొందడం వేరు. అక్కినేని సమంత ఇప్పుడు ఈ సెకండ్‌ వెర్షన్‌ని ఆస్వాదిస్తున్నారు. అక్కినేని కోడలు డిజిటల్‌ డెబ్యూ ఇంకా పూర్తిగా జరగకపోయినా, అప్పుడే అందరి ఐబాల్‌ అటెన్షన్‌నీ తనవైపు తిప్పుకుంటున్నారు. అంతా అనుకున్న టైమ్‌కే జరిగి ఉంటే, ఈ పాటికే రిలీజ్‌ కావాల్సింది ది ఫ్యామిలీ మేన్‌ 2 వెబ్‌సీరీస్‌. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్‌ సీజన్‌లో కాస్టింగ్‌ కూడా గ్రాండ్‌గానే ఉంది. ప్రియమణి, సమంత వంటి స్టార్ కాస్ట్ తో మేజిక్‌ చేశారు రాజ్‌ అండ్‌ డీకే.

ఫ్యామిలీ మేన్‌ సెకండ్‌ సీజన్‌ గురించి రీసెంట్‌గా మనసులో మాట చెప్పారు యాక్టర్‌ షరీబ్‌ హష్మి. నయా సీక్వెల్‌లో సమంత నటన అమేజింగ్‌ అనీ, గ్రేట్‌ జాబ్‌ చేశారనీ ప్రశంసించారు. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్‌ పార్ట్ కి తప్పకుండా మరింత గ్రాండ్‌ అప్లాజ్‌ ఉంటుందన్నది ఆయన మాట. ఇప్పటికే తమిళ్‌లో కాత్తువాక్కుల రెండు కాదల్‌, తెలుగులో శాకుంతలంలో నటిస్తున్న సమంతకి ఫ్యామిలీ మేన్‌ 2 డిజిటల్‌ స్పేస్‌లో ఎలాంటి ఇమేజ్‌ని క్రియేట్‌ చేస్తుందో, ఎలాంటి ఆపర్చ్యూనిటీస్‌ని తెచ్చిపెడుతుందో లెట్స్ట వెయిట్‌ అండ్‌ సీ..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌

Megastar Chiranjeevi: కీలక నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికులకు ఉచితంగా టీకా…

Superstar Mahesh Babu టాలీవుడ్‌లో కరోనా కలకలం… సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు..!

మన జీవన విధానాలను మార్చుకోవాలని ఈ కరోనా మనకు సూచిస్తోంది.. నాగార్జున హీరోయిన్..