టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌లో సత్తా చాటిన బజరంగీ భాయిజాన్ పాప.. ట్రోలర్స్ నోరుమూయించేలా..

బాలీవుడ్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది బజరంగీ భాయిజాన్.. సల్మాన్ ఖాన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమాకు కథ అందించింది ఎవరో కాదు.. మన టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో సమానంగా ఓ చిన్నారి నటించింది. సినిమా మొత్తం మాట్లాడకుండా ఉంటుంది ఆ చిన్నారి.. ఆమే హర్షాలీ మల్హోత్రా.

టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌లో సత్తా చాటిన బజరంగీ భాయిజాన్ పాప.. ట్రోలర్స్ నోరుమూయించేలా..
Harshaalimalhotra
Follow us

|

Updated on: May 15, 2024 | 7:44 AM

హర్షాలీ మల్హోత్రా.. ఈ అమ్మాయిని బాలీవుడ్ అంత తొందరగా మరిచిపోదు.. సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ చిన్నది. ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది బజరంగీ భాయిజాన్.. సల్మాన్ ఖాన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమాకు కథ అందించింది ఎవరో కాదు.. మన టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో సమానంగా ఓ చిన్నారి నటించింది. సినిమా మొత్తం మాట్లాడకుండా ఉంటుంది ఆ చిన్నారి.. ఆమే హర్షాలీ మల్హోత్రా. బజరంగీ భాయిజాన్ సినిమా 2015లో వచ్చింది. అప్పుడు ఆమె చిన్న పిల్లే ఇప్పుడు ఆ చిన్నది పదవ తరగతి చదువుతుంది.

హర్షాలీ మల్హోత్రా ఈ ఏడాది 10వ తరగతి పాసైంది . రీసెంట్ గా పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. తన ఫలితం గురించి ఆమె మాట్లాడుతూ సంతో వ్యక్తం చేసింది. ఇంతకాలం తనను ట్రోల్ చేసిన వారికి ఇప్పుడు ధీటుగా సమాధానం ఇచ్చింది ఈ చిన్నది. హర్షాలీ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా ఆమె రీల్స్ షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో కొంతమంది నెటిజన్స్ ఆమెను ట్రోల్‌ చేశారు. స్కూల్ కు వెళ్లి చదువుకో పాప’ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. ‘ఈ ఏడాది పదో తరగతి పాస్ అవుతావా.?’ అని కూడా కొందరు కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు అలాంటి వారి నోరు మూయించింది హర్షాలీ మల్హోత్రా.

CBSC 10వ తరగతిలో హర్షాలీ మల్హోత్రా 83% మార్కులు  సాధించింది. డ్యాన్స్ నేర్చుకుని, రీల్స్ చేస్తూ, ఫోటోషూట్ లకు పోజులిచ్చి జనాలను ఆకర్షిస్తూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టింది. ఫలితంగా ఆమెకు 83 శాతం మార్కులు వచ్చాయి. 10వ తరగతిలో తనకు వచ్చిన మార్కుల గురించి చెబుతూ హర్షాలీ మల్హోత్రా ఆనందం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులు తనకు వచ్చిన నెగెటివ్ కామెంట్స్ ని ఓ వీడియో ద్వారా చూపించింది. రీల్స్ చేస్తూనే రియల్ లైఫ్ లో విజయం సాధించవచ్చని హర్షాలీ మల్హోత్రా తెలిపింది. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ఎస్‌ఎస్‌ఎల్‌సీలో మంచి మార్కులు సాధించినందుకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..