AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ఆ యంగ్ హీరోతో సాయి పల్లవి గొడవ.. మూడేళ్ల తర్వాత హీరోయిన్ సమాధానం.. ఏం చెప్పిందంటే..

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలలో ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవిది (Sai Pallavi) ప్రత్యేక స్థానం. డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Sai Pallavi: ఆ యంగ్ హీరోతో సాయి పల్లవి గొడవ.. మూడేళ్ల తర్వాత హీరోయిన్ సమాధానం.. ఏం చెప్పిందంటే..
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2022 | 8:14 AM

Share

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలలో ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవిది (Sai Pallavi) ప్రత్యేక స్థానం. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసి.. యూత్ ఫెవరేట్ హీరోయిన్ అయ్యింది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ..కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా.. సినీ విశ్లేషకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది సాయి పల్లవి. ఇటీవల నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటన అందరిని కట్టిపడేసింది. అయితే సాయి పల్లవిపై ఎప్పుడూ అనేక విమర్శలు, ట్రోల్స్ జరుగుతుంటాయి.

షూటింగ్ సెట్‏లో పొగరు చూపిస్తుందని.. ఆటిట్యూడ్ ఉంటుందని.. హీరోలతో ర్యాష్ గా మాట్లాడుతుందని గతంలో టాక్ నడిచింది. ఈ క్రమంలోనే యంగ్ హీరో నాగశౌర్యతో గొడవపై స్పందించింది సాయి పల్లవి. వీరిద్దరు కలిసి కణం అనే సినిమా చేశారు. ఆ సినిమా చేసేటప్పుడు నాగశౌర్య.. సాయి పల్లవి పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై దాదాపు మూడేళ్ల తర్వాత సాయి పల్లవి నోరు విప్పింది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. ” నావలన ఎవరైన ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే బాధగా ఉంటుంది. గతంలో హీరో నాగశౌర్య నాపై కొన్ని కామెంట్స్ చేశాడు. అది విని నేను చాలా బాధపడ్డాను. వెంటనే కణం డైరెక్టర్ కు.. సినిమాటోగ్రాఫర్ కు కాల్ చేసి నా వలన మీకు ఇబ్బంది కలిగిందా ? అని అడిగాను. వారు లేదు అని చెప్పడంతో మనసు కుదుటపడింది. ఇక శౌర్య అంటే నాకు చాలా ఇష్టం. నటన బాగుంటుంది. నాలో నచ్చిందే అందరు చెప్తారు. శౌర్య నాలో నచ్చనిది చెప్పాడు. దానిని పాజిటివ్ గానే తీసుకున్నాను.. నావలన తను ఇబ్బంది పడితే నేను బాధపడినట్లే .. నా సమాధానంతో తను సంతృప్తి చెందుతాడని అనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Also Read: Mahesh Babu: బుర్జ్ ఖ‌లీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..

Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ పాటలు పాడుతున్న యంగ్ హీరో.. శర్వా సినిమా నుంచి సాంగ్..

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Siri-Srihan: ఎట్టకేలకు రూమర్స్‏కు ఫుల్‏స్టాప్ పెట్టిన లవ్ బర్డ్స్.. యాంకర్ రవి ఫ్యామిలీతో సిరి, శ్రీహాన్ సందడి..