Virupaksha: రెండు రోజుల్లో ‘విరూపాక్ష’ సాలిడ్ వసూళ్లు.. తేజ్‏కు కంగ్రాట్స్ చెప్పిన రామ్ చరణ్..

హర్రర్ థ్రిలర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సాధిస్తోంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.79 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న విరూపాక్ష సినిమా రెండవరోజు అంతకంటే ఎక్కువ స్థాయిలో 5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. మొదటి రోజు టాక్ బాగుండడంతో రెండవ రోజు నుంచి కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగాయి.

Virupaksha: రెండు రోజుల్లో 'విరూపాక్ష' సాలిడ్ వసూళ్లు.. తేజ్‏కు కంగ్రాట్స్ చెప్పిన రామ్ చరణ్..
Virupaksha
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 23, 2023 | 11:35 AM

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. సంయుక్త జంటగా నటించిన సినిమా విరూపాక్ష. డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ డే నుంచి ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యాక్సిడెంట్ తర్వాత తేజ్ కు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమా. ఇప్పటివరకు తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాగా నిలిచింది. హర్రర్ థ్రిలర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సాధిస్తోంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.79 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న విరూపాక్ష సినిమా రెండవరోజు అంతకంటే ఎక్కువ స్థాయిలో 5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. మొదటి రోజు టాక్ బాగుండడంతో రెండవ రోజు నుంచి కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగాయి.

రెండు రోజుల్లో విరూపాక్ష సినిమా సాధించిన కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 4.53 కోట్లు.. సీడెడ్ లో 1.43 కోట్లు.. ఉత్తరాంధ్రలో 1.33 కోట్లు.. ఈస్ట్ లో రూ. 75 లక్షలు.. వెస్టులో 6.6 లక్షలు.. గుంటూరులో 81 లక్షలు.. కృష్ణలో 70 లక్షలు.. నెల్లూరులో 38 లక్షలు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో మొత్తం రెండు రోజుల్లో రూ.10.59 కోట్లు షేర్ కలెక్షన్స.. 18.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి మొత్తంగా ఈ సినిమాకు రూ. 85 లక్షల షేర్ దక్కింది. ఇక ఓవర్సీస్ లో కూడా విరూపాక్ష సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం రూ. 13.65 కోట్ల షేర్ కలెక్షన్స్.. రూ. 24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ మూవీ మొత్తం రూ. 23 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగింది. అయితే రెండు రోజుల్లో రూ. 13.65 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేయాల్సి ఉంది. అంటే రూ. 9.35 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మొదటి రెండు రోజుల పరిస్థితి చూస్తే ఈరోజు కూడా ఈ సినిమాకు ఎక్కువగానే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆదివారం వచ్చే కలెక్షన్స్ అనుకున్న టార్గెట్ రీచ్ కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఇక విరూపాక్ష సినిమా సక్సెస్ కావడంపై తేజ్ కు కంగ్రాట్స్ చెప్పారు రామ్ చరణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.