Jr.NTR-Sai Dharam Tej: ఎన్టీఆర్ పై మెగా హీరో ఆసక్తికర ట్వీట్.. ఫుల్ ఖుషి అవుతున్న తారక్ ఫ్యాన్స్.. ఎందుకంటే ?..

తారక్ పై సాయి చూపించిన ప్రేమకు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ట్వీట్ తారక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సాయి పై నందమూరి ఫ్యాన్స్ ప్ర శంసలు కురిపిస్తున్నారు.

Jr.NTR-Sai Dharam Tej: ఎన్టీఆర్ పై మెగా హీరో ఆసక్తికర ట్వీట్.. ఫుల్ ఖుషి అవుతున్న తారక్   ఫ్యాన్స్.. ఎందుకంటే ?..
Ntr, Sai Dharam Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2022 | 9:02 AM

బైక్ యాక్సిడెంట్ తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ డీ 15 అనే వర్కింగ్ టై టిల్‏తో రూపొందుతున్న ఈ సినిమా గురించి గత కొద్ది రోజులుగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. సాయి హీరోగా నటిస్తోన్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా వస్తున్నారంటూ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా టీజర్ ఈవెంట్ కోసం కాదు.. ఏకంగా టైటిల్ గ్లింప్స్ వీడియోకు ఎన్టీఆర్ వాయిస్ అందించారు. సాయి పాత్ర ఎలా ఉండబోతుందనేది తారక్ చెప్పనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్వీసీసీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. తారక్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేసింది.

” SDT 15 టైటిల్ గ్లింప్స్ కు మీ అద్భుతమైన గొంతను ఇచ్చినందుకు థాంక్యూ తారక్ గారు. ఎస్డీటీ 15 టైటిల్ గ్లింప్స్ కోసం ఎన్టీఆర్ ఇచ్చిన గాత్రాన్ని డిసెంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు వినండి” అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు తన సినిమా కోసం సాయమందిస్తున్న తారక్ కు స్పెషల్ థాంక్స్ చెప్పారు సాయి ధరమ్ తేజ్. నీ మీద ప్రేమ మరింత పెరిగింది తారక్. నీ దగ్గరకి వచ్చినప్పుడు నువ్వు నన్ను రిసీవ్ చేసుకున్న విధానానికి థాంక్యూ అనేది చిన్నమాట అవుతుంది. నేను నటుడిగా మారకముందు నీ దగ్గరకు వచ్చినప్పటి రోజులు గుర్తుకువచ్చాయి. నీ వాయిస్‌తో మా సినిమా టైటిల్ గ్లింప్స్ మ్యాజిక్ చేస్తుంది. సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ అనేది నాకు ప్రత్యేకంగా నిలిచిపోతుంది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సాయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తారక్ పై సాయి చూపించిన ప్రేమకు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ట్వీట్ తారక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సాయి పై నందమూరి ఫ్యాన్స్ ప్ర శంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.