Republic Movie: సాయి ధరమ్ తేజ్ సినిమానుంచి క్రేజీ అప్డేట్..’రిపబ్లిక్’ టీజర్ రిలీజ్ చేయనున్న టీమ్ 

చాలా  కాలాంతర్వత చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. క

Republic Movie: సాయి ధరమ్ తేజ్ సినిమానుంచి క్రేజీ అప్డేట్..'రిపబ్లిక్' టీజర్ రిలీజ్ చేయనున్న టీమ్ 
Republic Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 31, 2021 | 4:30 PM

Republic Movie: చాలా కాలం తర్వత ‘చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘చిత్రలహరి’ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో ప్రతిరోజు పండగే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ‘సోలో బ్రతుకే సోబెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. లాక్ డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమా ఇది. ఈ సినిమా కూడా హిట్ టాక్ ను తెచుకోవడతో హ్యాట్రిక్ అందుకున్నాడు సాయి తేజ్.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో రిపబ్లీక్  అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత దేవాకట్టా నుండి మూవీ రాబోతుండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తోంది.  ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా పూర్తి చేశామని తెలిపారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిపబ్లిక్ టీజర్ ను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Seetimaar: గోపీచంద్ సీటీమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..?

Love Story Movie: అనౌన్స్ చేసిన డేట్‌‌‌‌‌‌కే పక్కాగా సినిమాను విడుదల చేస్తాం.. ‘లవ్ స్టోరీ’ ప్రొడ్యూసర్స్

Anu Emmanuel Love Story: అను ఇమ్మాన్యుయేల్‌ ప్రేమలో ఉంది ఈ మెగా హీరోతోనేనా..?