Pawan Kalyan: మినిస్టర్ మామయ్యకు మేనల్లుడి స్పెషల్ గిఫ్ట్.. పవన్‌కు సాయి ధరమ్ తేజ్ ఏమిచ్చాడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన జనసే పార్టీ అలాగే పవన్ కల్యాణ్ ను చూసి అభిమానులు, కార్యకర్తలు ఉప్పొంగిపోతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ ఆనందానికి అయితే అవధుల్లేకుండా పోయాయి.

Pawan Kalyan: మినిస్టర్ మామయ్యకు మేనల్లుడి స్పెషల్ గిఫ్ట్.. పవన్‌కు సాయి ధరమ్ తేజ్ ఏమిచ్చాడో తెలుసా?
Pawan Kalyan, Sai Dharam Tej
Follow us

|

Updated on: Jun 16, 2024 | 8:02 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన జనసే పార్టీ అలాగే పవన్ కల్యాణ్ ను చూసి అభిమానులు, కార్యకర్తలు ఉప్పొంగిపోతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ ఆనందానికి అయితే అవధుల్లేకుండా పోయాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ.. పవన్ కల్యాణ్ కు శనివారం (జూన్15) ఒక బహుబతి ఇచ్చి ఆశీర్వదించారు. అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్నును పవన్‌కి వదినమ్మ గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ. 2.5 లక్షల వరకూ ఉంటుందని అంచనా. తాజాగా జనసేన అధినేతకు మరో బహుమతి అందింది. ఆయన మేనల్లుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ స్పెషల్ గిఫ్ట్ తో పవన్ ను సర్ ప్రైజ్ చేశారు. అదేంటంటే..

పవన్ కల్యాణ్ కు సాయి ధరమ్ తేజ్ ఐకానిక్ ‘స్టార్ వార్స్ లెగో మిలీనియం ఫాల్కన్‌’ను స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ బహుమతిని ఇస్తూ పవన్ తో కలిసి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్.. ‘నాకు స్టార్ వార్స్, లెగోను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి.. నా ప్రియమైన జేడీ మాస్టర్, డిప్యూటీ సీఎంకి నేను ఒక బహుమతి ఇచ్చే అవకాశం దక్కింది. నా చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి ఈ స్టార్ వార్స్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు సాయి ధరమ్ తేజ్ దీని విలువ దాదాపు రూ. 1.2 లక్షలని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు మామా అల్లుళ్ల మధ్య అభిమానం-ప్రేమ నెక్ట్స్ లెవెల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ తో సాయి ధరమ్ తేజ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles