Tollywood : తండ్రికి క్యాన్సర్.. ట్రీట్మెంట్ జరుగుతున్నా షూటింగ్‌కు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..
తొలి చిత్రంతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అదృష్టమే కలిసిరావడం లేదు. తెలుగులో ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు రావడం లేదు. తొలి చిత్రం తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా తన తండ్రికి క్యాన్సర్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. RX100 సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఆడపాదడపా చిత్రాల్లో నటించింది. ఇప్పటివరకు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది పాయల్. ఇటీవలే మంగళవారం సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ మాత్రం రావడం లేదు. కానీ ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారంటూ ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. మంగళవారం (ఏప్రిల్ 8) నుంచే కీమోథెరపీ స్టార్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ క్లిష్ట సమయంలో అందరి మద్దతు తనకు కావాలని కోరింది. పాయల్ రాజ్ పుత్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. ఆమెకు ధైర్యం చెబుతున్నారు ఫ్యాన్స్.
‘అందరికీ నమస్కారం… మా నాన్న ఈ మధ్యే అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని నిర్ణయించాం. ఈరోజే (ఏప్రిల్ 8) తొలి కీమోథెరపీ సెషన్ స్టార్ట్ చేశారు. రాబోయే కఠినమైన ప్రయాణాన్ని తలుచుకుంటే కాస్త భయంగా ఉంది. కానీ ఇది తప్పదు కదా.. మా నాన్న చాలా స్ట్రాంగ్.. కోలుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ సమయంలోనూ నేను పనిపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఈ సమయంలో మీ ప్రేమ, మద్దతు, పాజిటివ్ వైబ్స్ నాకు చాలా అవసరం. ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నాం. క్యాన్సర్ పై పోరాడే క్రమంలో ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కావాలి’ అంటూ భావోద్వేగ పోస్ట్ చేస్తూ.. తన తండ్రి చికిత్స తీసుకుంటున్న ఫోటోను షేర్ చేసింది పాయల్ రాజ్ పుత్.
పాయల్ రాజ్ పుత్ పోస్ట్ పై హీరోయిన్స్ సిమ్రత్ కౌర్, రాయ్ లక్ష్మి వంటి తారలు స్పందిస్తూ ఆమె తండ్రి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేశారు. పాయల్ రాజ్ పుత్ కు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేశారు అభిమానులు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తెలుగుతోపాటు తమిళంలోనూ నటిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :