Rajinikanth : ఏంటీ.. ఆమెను చూసి నీలాంబరి పాత్రను సృష్టించారా.. ? అసలు విషయం చెప్పిన డైరెక్టర్..
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ నరసింహా. తమిళంలో పడయప్ప పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేయగా.. భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించగా.. నాజర్, ప్రకాష్ రాజ్, శ్రీలక్షీ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ కాంబోలో వచ్చిన సినిమాల్లో పడయప్ప ఒకటి. ఈ చిత్రాన్ని నరసింహా పేరుతో తెలుగులో డబ్ చేయగా.. సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలోని సాంగ్స్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇందులో రజినీ సరసన సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా ఈ మూవీలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. టాప్ హీరోయిన్ గా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్నఈ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది రమ్యకృష్ణ. తాజాగా ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ రవికుమార్. సినిమాను రూపొందించడమే కాకుండా తమిళంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి నటుడిగానూ తనదైన ముద్ర వేశారు రవికుమార్. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, శింబు, మాధవన్, మరియు సూర్య నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ నరసింహా సినిమాలోని నీలాంబరి పాత్రను ఓవ్యక్తిని చూసి సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు.. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత. రవికుమార్ దర్శకత్వంలో నటుడు రజనీకాంత్ నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. ఈసినిమాలో రజినీకాంత్ పాత్ర కంటే నీలాంబరి పాత్ర మరింత హైలెట్ అయ్యింది.
అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవికుమార్ మాట్లాడుతూ.. నీలాంబరి పాత్రను మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను ప్రేరణగా తీసుకుని రాశానని… ఆ సినిమా పై అప్పటి ముఖ్యమంత్రి జయలలిత దానిపై స్పందిస్తారని నేను ఊహించానని రవికుమార్ అన్నారు. కానీ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కూడా ఇంటర్వ్యూలో తాను ఏమీ అనలేదని చెప్పాడు.
ఇవి కూడా చదవండి :




