AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు గుడ్ బై చెప్పనున్న క్రేజీ బ్యూటీ.?

సినిమాల్లో రాణించడం అంత ఈజీ కాదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ కొంతమంది హీరోయిన్స్ కు స్టార్ డామ్ మమాత్రం రాదు. కొంతమంది వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ మాత్రం అందుకోలేక సతమతం అవుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

స్టార్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు గుడ్ బై చెప్పనున్న క్రేజీ బ్యూటీ.?
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 09, 2026 | 6:29 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఓ రంగుల ప్రపంచం.. ఇందులో రాణించాలని ఎంతో మంది ఆశతో అడుగుపెడుతూ ఉంటారు. కొంతమందికి అవకాశాలు రావడమే ఎంతో కష్టంగా ఉంటుంది. మరికొంతమంది హీరోయిన్స్ గా రాణించడానికి కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి హీరోయిన్ గా ఛాన్స్ వస్తే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. దాంతో సీనియర్ హీరోయిన్స్ కొంతమంది అవకాశాలు అందుకోలేకపోతున్నారు. అలాగే మరికొంతమంది వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది. చాలా మంది ముద్దుగుమ్మలు స్టార్ డమ్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం రేస్ లో వెనకపడిపోతుంది. పాన్ ఇండియా లెవల్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటుందనుకుంటే ఊహించని విధంగా వరుసగా ఫ్లాప్స్ అందుకుంటుంది.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

ఈ క్రమంలోనే ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుందట ఆ ముద్దుగుమ్మ. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజ, తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అలాగే వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

తెలుగులో దాదాపు అందరి హీరోల సరసన నటించి మెప్పించింది ఈ చిన్నది. ఇక ఈ బ్యూటీకి ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన పూజా హెగ్డే.. ఈ మధ్య వరుసగా ఫ్లాప్స్ అందుకుంటుంది. రీసెంట్ డేస్ లో పూజ చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతున్నాయి. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది సినిమాలకు గుడ్ బై చెప్పనుంది టాక్ వినిపిస్తుంది. సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే అంటున్నారు పూజా ఫ్యాన్స్. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us