AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K. Raghavendra Rao: ఆ సినిమాకు అప్పుడే 4 కోట్ల కలెక్షన్స్.. ఇప్పటి లెక్కలకు అదే 5000 కోట్లు.. రాఘవేంద్ర రావు..

దర్శకుడు కె. రాఘవేంద్ర రావు సినిమాలకు ఉండే ప్రత్యేక క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు సినిమాలు తగ్గించినప్పటికీ ఆయన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆయన ఓ చిత్రాన్ని కేవలం 38 రోజుల్లో తీసిన విధానం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అప్పట్లోనే ఆ సినిమా 4 కోట్ల వసూళ్లు రాబట్టిందని.. నేటి 5000 కోట్ల విలువతో సమానమని తెలిపారు.

K. Raghavendra Rao: ఆ సినిమాకు అప్పుడే 4 కోట్ల కలెక్షన్స్.. ఇప్పటి లెక్కలకు అదే 5000 కోట్లు.. రాఘవేంద్ర రావు..
Raghavendra Rao
Rajitha Chanti
|

Updated on: May 02, 2026 | 5:32 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో అత్యంత కీలకమైన అడవి రాముడు చిత్రం గురించి, ఆనాటి సినీ వాతావరణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జ్యోతి వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల తర్వాత, మాస్ కమర్షియల్ చిత్రం తీయాలనే ఆలోచనతో అడవి రాముడు వైపు మొగ్గు చూపినట్లు తెలిపారు. ఆ సినిమా అప్పట్లో నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేయగా, ప్రస్తుత విలువ ప్రకారం అది సుమారు ఐదువేల కోట్ల రూపాయలతో సమానమని ఆయన వివరించారు. ఎన్టీఆర్ వంటి లెజెండరీ నటుడిని ఒక మాస్ పాత్రలో చూపించడానికి తానెలా ఆలోచించాడో రాఘవేంద్ర రావు వివరించారు. ఎన్టీఆర్ కనిపించగానే పూలు, హారతులు వేసే అభిమానుల మధ్య, ఏనుగుపై వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో గజారోహణ సన్నివేశం రూపుదిద్దుకుందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Singer Sravana Bhargavi : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు చూశాను.. నాపై చాలా ట్రోల్స్ చేశారు.. శ్రావణ భార్గవి ఎమోషనల్.

అటవీ అధికారిగా కాకుండా, మొదట సాధారణ మనిషిగా వచ్చి అడవిలోని గిరిజనులతో కలిసి వారి గొప్పదనాన్ని తెలుసుకునే పాత్రను ఎందుకు ఎంచుకున్నారో వివరించారు. “కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు” అనే పాట సృష్టించి, తద్వారా గిరిజనుల ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచారో తెలిపారు. చివరి షాట్‌లో ఎన్టీఆర్‌ను రాముడిగా చూడాలనే తన కోరికను నెరవేర్చుకోవడం తన జీవితంలో ఒక మధురానుభూతి అని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తనను ఎంత ప్రేమగా చూసుకున్నారో, ఇట్ ఈజ్ ఏ గ్రీన్ మెమొరీ ఇన్ మై లైఫ్ బ్రదర్ అని అన్న మాటలను గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

రాఘవేంద్ర రావు తన కెరీర్‌లో ఎన్టీఆర్ తో 12 చిత్రాలు (వాటిలో 9-10 హిట్‌లు), చిరంజీవితో 14 చిత్రాలు చేశానని తెలిపారు. తన అదృష్టంగా మూడు తరాల నటులతో పనిచేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్, హరికృష్ణ, తారకరత్న; నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్; కృష్ణ, మహేష్ బాబు వంటి ప్రముఖ నటులతో పనిచేశానని తెలిపారు. శ్రీకాంత్ కొడుకును కూడా తానే పరిచయం చేశానని చెప్పారు. ఏ హీరో కూడా తన దర్శకత్వాన్ని వద్దు అనలేదని, అది తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అడవి రాముడు వంటి చిత్రాన్ని కేవలం 38 రోజుల్లో, జ్యోతిని 28 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. తన కెరీర్‌లో ఏ సినిమా కూడా 70 రోజులు దాటలేదని పేర్కొన్నారు. శ్రీదేవితో 24 చిత్రాలు చేశానని, ఆమె తన 25వ సినిమాకు కూడా కోరుకుందని, ఆమె అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరో వడ్డే నవీన్..

ఎక్కువ మంది చదివినవి : Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

Follow Us