AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (మే 3-9, 2026): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృషభ రాశి వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 02, 2026 | 4:23 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ వారం గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. సమయాన్ని అన్ని విధాలుగానూ సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. కొద్ది మార్పులతో అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన కొన్ని పనులు, వ్యవహారాలను వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా లక్ష్యాలు అంది వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. తోబుట్టువులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. బాగా బిజీ అవుతారు. వృత్తి రంగంలో ఉన్నవారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు కనిపిస్తాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహకారముంటుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. బంధువుల నుంచి ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సంపాదనపరంగా సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు కంపెనీల నుంచి కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ, పుణ్య కార్యాల్లోనూ పాల్గొంటారు.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగం సానుకూలంగా కొనసాగుతుంది. కొన్ని లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు కూడా వసూలువుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం చాలావరకు సామరస్యంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. జీత భత్యాలు పెరిగే సూచనలున్నాయి. కొద్దిపాటి మార్పులతో వృత్తి, వ్యాపారాలు ముందుకు దూసుకువెడతాయి. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. సొంత పనుల విషయంలో శ్రద్ధను పెంచడం మంచిది. పిల్లల చదువులు సంతృప్తికరంగానే సాగిపోతాయి. పిల్లలకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. సహాయ కార్య క్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు సమకూరే సూచనలున్నాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో పనిభారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమ‍స్యల నుంచి చాలావరకు బయటపడతారు. గృహ, వాహన రుణాల భారం తగ్గుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రాల్ని దర్శించుకుంటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపా రం మీద కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. భాగస్వాములు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులతో కాస్తంత సహనంతో వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): డాక్లర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, ఇతర వృత్తి నిపుణుల వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇతరులకు సహాయం అందించగలిగిన స్థితిలో ఉంటారు. కొద్దిపాటి ఖర్చుతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొంటారు.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకోకుండా, అప్రయత్నంగా మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ప్రణాళికాబద్ధంగా పని చేసి, ముఖ్యమైన వ్యవహారాలను, కార్యకలాపాలను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవడంతో పాటు, ఉద్యోగం మార డానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలు న్నాయి. బంధువులు, తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. బంధువుల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు మిత్రుల సహాయంతో పురోగమిస్తాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మీ మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను, లక్ష్యాలను అందుకుంటారు. ఏ రంగానికి చెందిన ఉద్యోగులైనప్పటికీ వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లో సైతం దూసుకుపోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం ప్రస్తుతానికి చాలా మంచిది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు అదనపు లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది.  ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిమ్మల్ని కొందరు మిత్రులు స్వార్థానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలను తెలివితేటలతో, సమయ స్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. గృహ, వాహన రుణాలకు సంబంధించిన ఒత్తిడి నుంచి బయటపడతారు.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ముందుకు సాగుతుంది. ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా పురోగమిస్తుంది. పని భారం, ఒత్తిడి తగ్గుముఖం పడతాయి. అధికారుల ఆదరణతో హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువుల నుంచి మీకు రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో అందుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

12 / 12
Follow Us