Riddhi Kumar: ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన కుర్రబ్యూటీ రిద్ది కుమార్.. ఏ సినిమాలో అంటే
రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఆదిపురుష్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీతగా బాలీవుడ్ భామ కృతిసనన్ నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ గా నటిస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ మూవీలే.. ప్రస్తుతం డార్లింగ్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఆదిపురుష్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీతగా బాలీవుడ్ భామ కృతిసనన్ నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ఈ టీజర్ పై విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అదే విధంగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ యంగ్ రెబల్ స్టార్.
ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీరికెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో మర్డర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఇటీవలే సైలెంట్ గా ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపిస్తాడని టాక్ కూడా వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. అలాగే మెయిన్ హీరోయిన్ గా మాళవికా మోహనన్ ని ఎంపిక చేశారు. ఇక ఇప్పుడు మూడో హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మూడో హీరోయిన్ గా రిద్ది కుమార్ ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. రిద్ది కుమార్ ప్రభాస్ న నటించిన రాధేశ్యామ్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తెలుస్తోంది.